బెంగాల్ లో స‌ర్వ శ‌క్తులూ ఒడ్డుతున్న మోడీ..!

ఎన్నిక‌లు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేస‌రికి భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మ‌రోసారి మోడీ ప్ర‌ధాని కాబోతున్నారు, సొంతంగా భాజ‌పా అధికారంలో రాబోతోంద‌ని చెప్తూ వ‌చ్చిన నాయ‌కుల గ‌ళంలో కొంత మార్పు గ‌డ‌చిన కొద్దిరోజులుగా క‌నిపిస్తోంది. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంటే, ఇప్పుడు మిత్ర‌ప‌క్షాల ప్రాధాన్య‌త పెంచుతున్న ప‌రిస్థితి. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్ విష‌యానికొస్తే… ఇప్పుడు అక్క‌డే భాజ‌పా శ‌క్తుల‌న్నీ ఒడ్డి పోరాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అన్ని ర‌కాల అస్త్రాల‌నూ ప్రయోగించి, బెంగాల్ లో పెద్ద సంఖ్య‌లో సీట్లు సాధించాల‌న్న ప‌ట్టుద‌ల మోడీలో క‌నిపిస్తోంది.

దాన్లో భాగంగానే త‌న‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుల ట‌చ్ లో ఉన్నార‌నీ, త‌ల్చుకుంటే ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేస్తామ‌న్న‌ట్టుగా మోడీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీన్లో కొంత వాస్త‌వ‌మూ లేక‌పోలేద‌నే‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. శార‌దా కుంభ‌కోణంలో ఇరుక్కున్న కొంత‌మంది తృణ‌మూల్ నేత‌ల‌ను భాజ‌పా బాగానే ఆక‌ర్షించందని చెప్పొచ్చు. కాబ‌ట్టి, దీదీ పార్టీ నుంచి భాజ‌పాకి వ‌ల‌స‌లు ఉండే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. దీంతోపాటు, బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌ని అయిపోయింద‌నీ… మ‌మ‌తా బెన‌ర్జీకి ప్ర‌త్యామ్నాయం తామే అన్న‌ట్టుగా తాజాగా మోడీ మాట్లాడుతున్నారు. అయితే, వాప‌క్షాలు ఇప్పటికీ బ‌లంగానే ఉన్నాయ‌నీ, ఈ ఎన్నిక‌ల్లో బెంగాల్ లో పుంజుకునే అవ‌కాశం ఉంద‌నే విశ్లేష‌ణ‌లు కొన్ని జాతీయ మీడియాలో వ‌స్తున్నాయి. తామే ప్ర‌త్యామ్నాయం అని మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నా… సంస్థాగ‌తంగా వామ‌పక్షాలు ప‌ట్టుని అంత సులువుగా వ‌దులుకునే అవ‌కాశం లేద‌నే అభిప్రాయం ఉంది.

ఇక‌, మిగిలింది హిందుత్వ కార్డు. రాముడి గురించి దేశంలో ఎక్క‌డా చేయనంత ఎక్కువ ప్ర‌చారంలో బెంగాల్ లో చేస్తున్నారు మోడీ షా ద్వయం. ఎందుకంటే, మైనారిటీ ఓట్లు మ‌మ‌తా బెన‌ర్జీకి బ‌లం కాబ‌ట్టి… హిందూ ఓటు బ్యాంకులో కొంత చీలిక తీసుకొస్తే త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌నేది వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, మైనారిటీల‌తో ఎంత స‌యోధ్య‌గా మ‌మ‌తా ఉంటున్నారో, హిందువుల‌తో కూడా అంతే సన్నిహితంగా ఆమె ఉంటార‌నీ, కాబ‌ట్టి హిందువుల ఓట్ల‌లో అంత ఈజీగా చీలిక రాలేద‌నే అభిప్రాయం కూడా ఉంది. బెంగాల్ లో హిందుత్వ‌, వామ‌ప‌క్షాల‌కు ప్ర‌త్యామ్నాయం, శార‌దా స్కామ్ లో ఇరుక్కున్న నేత‌లు…. ఇలా ఏ మార్గాన్నీ భాజ‌పా వ‌ద‌ల‌డం లేదు. ఓవ‌రాల్ గా బెంగాల్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి ఇంత తీవ్ర‌మైన పోరాటం ఎందుకూ అంటూ… ఉత్త‌రాదిలో, ద‌క్షిణాదిలో భాజ‌పాకి గ‌తంలో వచ్చిన‌న్ని సీట్లు రావ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మైన‌ట్టుగా ఉంది. అందుకే, ఇప్పుడు తూర్పు మీద ఆధార‌ప‌డుతున్నారు. అయితే, అక్క‌డ వాతావ‌ర‌ణం భాజ‌పాకి మ‌రీ అంత అనుకూలంగా మారే ప‌రిస్థితులూ త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని చెప్పొచ్చు. బెంగాల్ లో స‌ర్వ శ‌క్తులూ ఒడ్డుతున్న మోడీ..!

ఎన్నిక‌లు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేస‌రికి భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. మ‌రోసారి మోడీ ప్ర‌ధాని కాబోతున్నారు, సొంతంగా భాజ‌పా అధికారంలో రాబోతోంద‌ని చెప్తూ వ‌చ్చిన నాయ‌కుల గ‌ళంలో కొంత మార్పు గ‌డ‌చిన కొద్దిరోజులుగా క‌నిపిస్తోంది. మిత్ర‌ప‌క్షాల‌తో క‌లిసి తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంటే, ఇప్పుడు మిత్ర‌ప‌క్షాల ప్రాధాన్య‌త పెంచుతున్న ప‌రిస్థితి. ఇక‌, ప‌శ్చిమ బెంగాల్ విష‌యానికొస్తే… ఇప్పుడు అక్క‌డే భాజ‌పా శ‌క్తుల‌న్నీ ఒడ్డి పోరాడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అన్ని ర‌కాల అస్త్రాల‌నూ ప్రయోగించి, బెంగాల్ లో పెద్ద సంఖ్య‌లో సీట్లు సాధించాల‌న్న ప‌ట్టుద‌ల మోడీలో క‌నిపిస్తోంది.

దాన్లో భాగంగానే త‌న‌తో తృణ‌మూల్ కాంగ్రెస్ నాయ‌కుల ట‌చ్ లో ఉన్నార‌నీ, త‌ల్చుకుంటే ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేస్తామ‌న్న‌ట్టుగా మోడీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీన్లో కొంత వాస్త‌వ‌మూ లేక‌పోలేద‌నే‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. శార‌దా కుంభ‌కోణంలో ఇరుక్కున్న కొంత‌మంది తృణ‌మూల్ నేత‌ల‌ను భాజ‌పా బాగానే ఆక‌ర్షించందని చెప్పొచ్చు. కాబ‌ట్టి, దీదీ పార్టీ నుంచి భాజ‌పాకి వ‌ల‌స‌లు ఉండే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం. దీంతోపాటు, బెంగాల్ లో వామ‌ప‌క్షాల ప‌ని అయిపోయింద‌నీ… మ‌మ‌తా బెన‌ర్జీకి ప్ర‌త్యామ్నాయం తామే అన్న‌ట్టుగా తాజాగా మోడీ మాట్లాడుతున్నారు. అయితే, వాప‌క్షాలు ఇప్పటికీ బ‌లంగానే ఉన్నాయ‌నీ, ఈ ఎన్నిక‌ల్లో బెంగాల్ లో పుంజుకునే అవ‌కాశం ఉంద‌నే విశ్లేష‌ణ‌లు కొన్ని జాతీయ మీడియాలో వ‌స్తున్నాయి. తామే ప్ర‌త్యామ్నాయం అని మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నా… సంస్థాగ‌తంగా వామ‌పక్షాలు ప‌ట్టుని అంత సులువుగా వ‌దులుకునే అవ‌కాశం లేద‌నే అభిప్రాయం ఉంది.

ఇక‌, మిగిలింది హిందుత్వ కార్డు. రాముడి గురించి దేశంలో ఎక్క‌డా చేయనంత ఎక్కువ ప్ర‌చారంలో బెంగాల్ లో చేస్తున్నారు మోడీ షా ద్వయం. ఎందుకంటే, మైనారిటీ ఓట్లు మ‌మ‌తా బెన‌ర్జీకి బ‌లం కాబ‌ట్టి… హిందూ ఓటు బ్యాంకులో కొంత చీలిక తీసుకొస్తే త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌నేది వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, మైనారిటీల‌తో ఎంత స‌యోధ్య‌గా మ‌మ‌తా ఉంటున్నారో, హిందువుల‌తో కూడా అంతే సన్నిహితంగా ఆమె ఉంటార‌నీ, కాబ‌ట్టి హిందువుల ఓట్ల‌లో అంత ఈజీగా చీలిక రాలేద‌నే అభిప్రాయం కూడా ఉంది. బెంగాల్ లో హిందుత్వ‌, వామ‌ప‌క్షాల‌కు ప్ర‌త్యామ్నాయం, శార‌దా స్కామ్ లో ఇరుక్కున్న నేత‌లు…. ఇలా ఏ మార్గాన్నీ భాజ‌పా వ‌ద‌ల‌డం లేదు. ఓవ‌రాల్ గా బెంగాల్ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి ఇంత తీవ్ర‌మైన పోరాటం ఎందుకూ అంటూ… ఉత్త‌రాదిలో, ద‌క్షిణాదిలో భాజ‌పాకి గ‌తంలో వచ్చిన‌న్ని సీట్లు రావ‌డం లేద‌ని స్ప‌ష్ట‌మైన‌ట్టుగా ఉంది. అందుకే, ఇప్పుడు తూర్పు మీద ఆధార‌ప‌డుతున్నారు. అయితే, అక్క‌డ వాతావ‌ర‌ణం భాజ‌పాకి మ‌రీ అంత అనుకూలంగా మారే ప‌రిస్థితులూ త‌క్కువ‌గానే ఉన్నాయ‌ని చెప్పొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close