అనుప‌మ స్ట్రాట‌జీ ఏమిటి?

మొన్న‌టి వ‌ర‌కూ చూసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వేరు. ఇప్ప‌టి అనుప‌మ వేరు. ప‌ద్ధ‌తిగా, ప‌క్కింటి అమ్మాయిలా, సంప్ర‌దాయానికి నిలువెత్తు చిరునామాలా క‌నిపించిన అనుప‌మ ఇప్పుడు ‘హాట్’ బాట ప‌ట్టింది. ముద్దుల‌తో ముంచెత్తుతోంది. ‘రౌడీ బోయ్స్’ ఓ చిన్న లిప్ లాక్ ఇస్తేనే యూత్ గిల‌గిల‌లాడేసింది. ఇప్పుడు`టిల్లు స్క్వేర్‌`లో ఏకంగా కిస్సుల బ‌స్సులేసుకొని వ‌చ్చేసింది. ఒక‌టి కాదు, రెండు కాదు.. మూడు సుదీర్ఘ‌మైన లిప్ లాక్కుల‌తో హోరెత్తించింది. ఫైట్ సీన్‌లో కూడా స‌డన్ లిప్ లాక్ ఇచ్చి వెర్రెక్కించింది. క‌ట్టూ, బొట్టూలో కూడా స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపించింది. అనుప‌మ‌ని ఇది వ‌ర‌కు ఇంత హాట్ గా చూడ‌లేద‌ని ఆమె అభిమానులు కూడా స్వీట్‌గా కంప్లైంట్ చేస్తున్నారు. అనుప‌మ‌లోని ఈ మార్పుకి కార‌ణ‌మేంట‌న్న‌ది అంద‌రి ప్ర‌శ్న‌.

అనుప‌మ కెరీర్ మొద‌ట్లో ఆమెకెందుకో ప‌ద్ధ‌తైన పాత్ర‌లే వ‌చ్చాయి. వాటిని తు.చ త‌ప్ప‌కుండా చేసుకొంటూ వెళ్లిపోయింది. ఆమెలో ఓ హాట్ యాంగిల్ కూడా ఉంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. స‌డ‌న్‌గా `రౌడీ బోయ్స్‌`తో అది బ‌య‌ట‌ప‌డింది. నిజంగా.. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది కానీ, అందులోని లిప్ లాక్‌.. అనుప‌మ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసింది. తెర‌పై అనుప‌మ‌ని ఇలాంటి పాత్ర‌ల్లో కూడా చూపించొచ్చు… అని నిరూపించింది. ఓర‌కంగా అనుప‌మ కెరీర్‌కు ఓ కొత్త రూట్ మ్యాప్ ఇచ్చిన‌ట్టైంది. అనుప‌మని ప‌ద్ధ‌తైన పాత్ర‌ల్లో చూసీ, చూసీ బోర్ కొట్టిన‌వాళ్ల‌కు ఈ పాత్ర‌ల‌కు రిలీఫ్ ఇచ్చాయి. అనుప‌మ ఇమేజ్ మారింది. ఇక నుంచి హాట్ గాళ్ పాత్ర‌ల‌కు ఆమె ఓ మంచి ఆప్ష‌న్‌గా మారిపోయింది. అనుప‌మ స్ట్రాట‌జీ కూడా అదే. త‌న పంథాని మార్చుకొంటే, ఇంకొంత కాలం చిత్ర‌సీమ‌లో కొన‌సాగొచ్చు. సీనియ‌ర్ హీరోలు అనుప‌మ‌ని ప‌ట్టించుకోరు. యూత్ హీరోల సినిమాల్లో ఇప్పుడు ముద్దు సీన్లు.. చాలా త‌ప్ప‌ని స‌రి వ్య‌వ‌హారంగా మారిపోయింది. ఇలాంటి సీన్ల‌కు `నో` చెప్పుకొంటూ పోతే, అవ‌కాశాలు రావు స‌రిక‌దా, చిత్ర‌సీమ కూడా పూర్తిగా ప‌క్క‌న పెడుతుంది. ఆ ప్ర‌మాదం ముంచుకురాకుండా అనుప‌మ ఈ స్ట్రాట‌జీని ఎంచుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close