నెక్ట్స్ జార్ఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు !

బీజేపీ రాజకీయాల దెబ్బకు షివరైపోతున్న ప్రభుత్వాల జాబితాలో జార్ఖండ్, ఢిల్లీ ప్రభుత్వాలు చేరాయి. ఈ రెండు ప్రభుత్వాల్లోని వారిపై ఇటీవలి కాలంలో దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయి. అక్కడి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపైనా గురి పెట్టినట్లుగా చెబుతున్నారు. జార్ఖండ్‌లో సీఎంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఉన్నారు. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ నేరుగా ఈసికి సిఫార్సు చేశారు. ఎందుకంటే ఆయన పేరుపై గనులున్నాయని.. ఆయన లాభదాయ పదవిని కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు.

ఇప్పటికే జార్ఖండ్‌లో సీబీఐ పలువురు ఆ కూటమిపార్టీలకు చెందిన వారిపై దాడులు చేస్తోంది. ముఖ్యంగా సీఎంహేమంత్ సోరెన్ సన్నిహితులను టార్గెట్ చేసింది. దీంతో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేయడం కష్టంగా మారింది. అదే సమయంలో ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో రెండు,మూడు తప్ప మొత్తం సీట్లు గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వణికిపోతోంది. తమకు పాతిక కోట్లు ఆఫర్ చేశారని నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తెర ముందుకు వచ్చి చెప్పారు .. అయితే చాలా మంది ఆప్ నాయకత్వంతో టచ్ లో లేకుండా పోయారు. కేజ్రీవాల్ నిర్వహించిన సమావేశానికి రాలేదు.

తమ ప్రభుత్వం పడగొట్టాలంటే ఒక్కొక్కరికి ఇరవై కోట్ల చొప్పున నలభై మందికి ఎనిమిది వందల కోట్లివ్వాలని.. ఈ మేరకు ఆఫర్లురెడీ చేసి బీజేపీ ప్రయత్నతిస్తోందని.. కానీ తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని కేజ్రీవాల్ అంటున్నారు. కానీ కొంత మంది టచ్‌లో లేకుండా పోవడంతో కేజ్రీవాల్‌కూ టెన్షన్ తప్పడం లేదు. దేశంలో పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా.. ప్రభుత్వాలకు వణుకు తప్పడంలేదు. ఓట్లు కొనే ప్రజాస్వామ్యం కొత్త పుంతలు తొక్కుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close