సారా విపత్తుని పక్కకు నెట్టేసిన పెగాసస్ !

మమతా బెనర్జీ చెప్పారంటే చంద్రబాబు కొనే ఉంటారని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో అదే పనిగా చెప్పారు. చివరికి బుగ్గన కూడా అదే అని విచారణ కోసం హౌస్ కమిటీని అడిగారు. స్పీకర్ సరే అన్నారు. రెండు రోజుల్లో పెగాసస్‌పై విచారణకు హౌస్ కమిటీని ప్రకటిస్తారు. అయితే అందరికీ వస్తున్న డౌట్ ఒకటే.. మమతా బెనర్జీ చెప్పారని అంటున్నారు కానీ ప్రభుత్వం వైసీపీ చేతుల్లో ఉంది.. కావాలంటే యాభై ఏళ్ల కిందటి నాటి రికార్డులు బయటకు తీసి క్షణాల్లో పెగాసస్ కొన్నారో లేదో చెప్పేయవచ్చు. ఎవరెవరిపై వాడారో చెప్పొచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయకుండా పూర్తిగా మమతా బెనర్జీ మీద తోసేసి.. విచారణకు హౌస్ కమిటీ వేయడం ఏమిటన్నది ఇప్పుడు అందరికీ ఓ పెద్ద డౌటానుమానంగా మారింది.

పెగాసస్ కొంటే చెప్పడానికి ప్రభుత్వానికి క్షణం పని !

ఏదో ఓ ప్రచారం చేయడానికి బాగుంటుందనుకుంటున్నారుకానీ.. సామాన్యులకు కూడా ప్రభుత్వం మీదే కదా ఎందుకు బయటపెట్టడం లేదన్న సందేహం వస్తుందన్న ఆలోచన చేయడం లేదు. అలాంటి ఆలోచన లేకుండా వరుస ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేయవచ్చని వైసీపీ నేతలు అనుకుంటున్నారేమో కానీ తమ వ్యూహం తాము పాటిస్తున్నారు.అసెంబ్లీలో హౌస్ కమిటీ ప్రకటన చేసిన తర్వాత నిఘా మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టారు. పెగాసస్ స్పైవేర్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని .. నిజంగా వాడి ఉంటే ప్రభుత్వమే ప్రకటన చేయాలని సూచించారు. – సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే పెగాసస్‌ను కొనలేదని డీజీపీ ఆఫీస్‌ లేదు అని చెప్పిందని అయినా ఆరోపణలు చేస్తున్నారని.. పెగాసస్‌పై అనుమానాలు నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యతన్నారు.

ఏదీ చెప్పకుండా రాజకీయ ఆరోపణలు ఎందుకన్న మాజీ నిఘా చీఫ్ !

2015 నుంచి 2019 మార్చి ఆఖరి వరకు ప్రభుత్వం గానీ, డీజీపీ ఆఫీస్‌గా, సీఐడీ విభాగం గానీ, ఏ ఇతర విభాగం గానీ, ఏ ప్రైవేటు ఆఫీస్‌ గానీ పెగాసస్‌ కొనలేదు వాడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వమే ఒక స్టేట్‌మెంట్ ఇస్తే మంచిదని … లేనిపోని ఆరోపణలు అసత్యాలు అసంబద్దమైనటువంటి వాదనలతో ప్రజలను కన్ఫ్యూజన్‌లో పడేయడం ఎందుకని ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనకు ఇంకా రెండేళ్ల సర్వీసు ఉందని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దామన్నారు.

ఏ విచారణ అయినా చేసుకోవాలని లోకేష్ సవాల్

పెగాసస్ అంశంపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని టీడీపీ నేత నారా లోకేష్ సవాల్ చేశారు. అసలు చంద్రబాబు స్పైవేర్ కొన్నారని మమతా బెనర్జీ అన్నారో లేదో ఎవరికీ తెలియదన్నారు. అసెంబ్లీలో అన్నారని చెబుతున్న వీడియో బెంగాలీలోలో ఉందని.. బెంగాలీ భాష తెలిసిన వాళ్లు.. అసలు అందులో పెగాసస్ అంశంపైనే మాట్లాడలేదని చెబుతున్నారన్నారు. మొత్తంగా సారా మరణాల అంశాన్ని పెగాసస్‌తో తప్పుదోవ పట్టించడంలో ఏపీ ప్రభుత్వం సక్సెస్ అయిందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close