లెక్కలు చెప్పకపోయినా ఏపీకి అప్పులు !

ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినా కేంద్రం విస్తృతంగా సహకారం అందిస్తూనే ఉంది. కానీ లేఖలు మాత్రం కఠినంగా రాస్తోంది. కేంద్రం తీరు చూసి ఆర్థిక శాఖ అధికారులు కూడా నవ్వకుంటున్నారు. అన్ని రకాల అప్పుల వివరాలు చెప్పకపోతే కొత్త అప్పులకు పర్మిషన్ ఇవ్వబోమంటూ కొత్తగా లేఖ వచ్చింది.అది ఒక్క ఏపీకే కాదు మొత్తం అన్ని రాష్ట్రాలకు రాశారు. అయితే ఏ రాష్ట్రానికిఅప్పుల పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఏపీకి మాత్రం ఇచ్చారు. ఈ అప్పుల పర్మిషన్ తో ఇప్పటికే ఆర్బీఐ నుంచి రూ. నాలుగు వెల కోట్లను రెండు వారాల్లో అప్పులు తెచ్చేసుకుని రూ. వెయ్యి కోట్లను ఓ పథకం కింద మీట నొక్కేశారు..

ఇప్పుడు కేంద్రం నుంచి లేఖలు వస్తున్నాయి. అప్పుల లెక్కలు చెప్పకపోతే పర్మిషన్ ఇవ్వబోమని. ఇచ్చేసిన తర్వాత కూడా ఇలాంటి లేఖలు రాయడం కేంద్రానికే చెల్లుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితిపై నిజాలు తెలుసుకోవాలంటే కేంద్రానికి గంటపని. ఏపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేయలేదు. అన్నీ బ్యాంకులు.. ప్రభుత్వ సంస్థల వద్దే చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పుల వివరాలు ఇవ్వాలంటే వారు క్షణంలో ఇస్తారు. కానీ ఎందుకు ఆలోచిస్తుందో .. ఎందుకు అప్పులు ఇప్పిస్తూ.. లెక్కలు చెప్పాలని లేఖలు రాస్తుందో అధికారులకు మాత్రమే తెలుసు.

శ్రీలంకలో సంక్షోభం ఏర్పడింది. పాకిస్తాన్‌లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. నేపాల్ కుప్పకూలడానికి సిద్ధంగా ఉండి. ఇలాంటిపరిస్థితుల్లో ఆ ప్రభావం భారత్ పై పడకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.కానీ కేంద్రం రాష్ట్రాల విషయంలో పైపై చర్యలు చేస్తూ.. ఆర్థిక పరిస్థితి కుంగిపోయేలా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నారు. దీని ఫలితాలు అనుభవించాల్సింది ప్రజలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close