అప్పుల విష‌యంలో ఆంధ్రాతో కేసీఆర్ పోల్చ‌రేమో..!

తెల్లారితే చాలు ప్రతీ అంశాన్నీ ఆంధ్రాతో పోల్చి విమ‌ర్శ‌లు చేసుకుంటూ ఎన్నిక‌ల ప్ర‌చారం సాగిస్తున్నారు తెలంగాణ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆంధ్రాలో రుణ‌మాఫీ అమ‌లుకాలేద‌నీ, విద్యుత్ సరిప‌డా లేద‌నీ, అభివృద్ధి లేదంటూ… గ‌డ‌చిన కొన్ని రోజులుగా విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఆర్బీఐ ఇచ్చిన ఒక నివేదిక‌లో తేలిందేంటంటే… ధ‌నిక రాష్ట్రంగా ఏర్ప‌డ్డ తెలంగాణ మెల్ల‌గా అప్పుల్లో కూరుకుపోతోంద‌నీ, పేద రాష్ట్రంగా ప్రారంభ‌మైన న‌వ్యాంధ్ర మెల్ల‌గా అప్పుల ఊబి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం మొద‌లైంద‌ని.

రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితిపై తాజాగా ఒక నివేదిక‌ను ఆర్బీఐ విడుద‌ల చేసింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో తెలంగాణ తీసుకున్న అప్పులు 9.5 శాతం పెరిగిన‌ట్టు ఆర్బీఐ పేర్కొంది. గ‌త ఏడాది జీఎస్ డీపీ మీద అప్పు 22.2 శాతం పెరిగింద‌నీ, ఇది అంత‌కుముందు ఆర్థిక సంవ‌త్స‌రం, అంటే 2016-17లో 12.7గా ఉంద‌ని ఆర్బీఐ స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఆంధ్రా విష‌యానికొస్తే… అప్పుల శాతం 9.1 త‌గ్గిందని నివేదిక‌లో ఆర్బీఐ చెప్పింది. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో రాష్ట్ర జీఎస్ డీపీపై 36.4 శాతం అప్పులుంటే… గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి వ‌చ్చేస‌రికి 27.3కి ఆంధ్రా త‌గ్గించుకుంది. తెలంగాణలో ప‌రిపాల‌నా ప‌ర‌మైన ఖ‌ర్చులు గ‌డ‌చిన ఏడాదిలోగా గ‌ణ‌నీయంగా పెర‌గ‌డ‌ం విశేషం. తెచ్చిన అప్పుల్ని అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై ఖ‌ర్చు చేస్తే స‌మ‌ర్థించుకోవ‌చ్చు, కానీ అభివృద్ధియేత‌ర వ్య‌యం ఒక్క ఏడాదిలో 3.4 నుంచి 35.2 శాతానికి పెర‌గ‌డం ఏంట‌ని ఆర్బీఐ స్వ‌యంగా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి. ఆర్థిక నిర్వ‌హ‌ణ విష‌యంలో తెలంగాణ అస‌మ‌ర్థంగా ఉందంటూ కాగ్ ఇచ్చిన నివేదిక‌ను కూడా ఈ సంద‌ర్భంగా ఆర్బీఐ స‌మ‌ర్థించ‌డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌తీ అంశాన్నీ ఏపీతో పోల్చి, త‌న పాల‌న‌లో అద్భుతాలు సాధించామ‌ని కేసీఆర్ చెప్పుకుంటున్నారు క‌దా! మ‌రి, తాజా నివేదిక‌పై ఏం చెబుతారు? పోనీ, అదంతా అభివృద్ధి కోసం చేసిన ఖ‌ర్చే అని స‌మ‌ర్థించుకునే ప‌రిస్థితి కూడా లేదు. పాల‌నా ప‌ర‌మైన ఖ‌ర్చులు ఎక్కువ‌య్యాయ‌ని ఆర్బీఐ చెప్పింది. నిజానికి, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్రా ఆర్థిక ప‌రిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ రాష్ట్రం అప్పులు గ‌ణ‌నీయంగా పెరిగినా కొంత అర్థం ఉండేది. కానీ, మిగులు రాష్ట్రమైన తెలంగాణ‌లో అప్పుల శాతం పెర‌గ‌డమంటే దేనికి సంకేతం..? ఆర్బీఐ నివేదిక‌పై కేసీఆర్ స్పంద‌న ఎలా ఉన్నా… మ‌హా కూట‌మికి మంచి స‌మ‌యంలో అందివ‌చ్చిన విమ‌ర్శ‌నాస్త్రంగా దీన్ని చెప్పుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close