కేంద్ర మంత్రులతో ప్రచారం ఫలిస్తుందా..?

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి భాజపా భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. గత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాసని గెలిపిస్తే.. ఇంతవరకూ వారేం చేశారో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేస్తామన్నారు. ఇప్పుడు కాస్తో కూస్తో నగరాల్లో అభివ్రుద్ధి జరుగుతోందంటే దానికి కారణం కేంద్రంలోని మోడీ సర్కారే అన్నారు. నగర ప్రాంతాల్లో జరుగుతున్న అభివ్రుద్ధికి కేంద్రం నిధులే ఖర్చు చేస్తున్నారన్నారు.

పార్టీ తరఫున ప్రచారానికి లక్ష్మణ్ తోపాటు, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు, మురళీధరరావు వెళ్తారట. వీళ్లతోపాటు, కొన్ని ప్రత్యేక సభలు పెట్టి… కేంద్రమంత్రుల్ని రప్పించే ఆలోచనలో ఉన్నామని లక్ష్మణ్ అంటున్నారు. నగరాభివ్రుద్ధి భాజపాతో ఎలా సాధ్యమో వివరించాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. సీఏఏ, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి అంశాలపై ప్రసంగాలు ఇప్పించే ఉద్దేశంలో ఉన్నట్టు సమాచారం.

కేంద్ర మంత్రులు ప్రచారానికి రావడం వల్ల కొంత హడావుడి ఉంటుంది. కానీ, వాస్తవంలో దాని ప్రభావం ఎంత అంటే, ఆలోచించాల్సిందే? ఎందుకంటే, ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు. ప్రధాన పార్టీల గుర్తులతో అభ్యర్థులు పోటీ పడుతున్నా… స్థానికాంశాలే ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి. ఏ పార్టీ అయినా క్షేత్రస్థాయి సమస్యలపైనే ఎన్నికలకు వెళ్లాలి. అంతేగానీ, జాతీయ నాయకుల్ని తీసుకొచ్చి సీఏఏ గురించో, ట్రిపుల్ తలాక్ రద్దు, కాశ్మీర్లో 370 రద్దు… ఇలాంటి మాట్లాడితే వాటి ప్రభావం ఉంటుందా అనేదే ప్రశ్న? ఇంకోంటి.. ప్రచారం గురించి ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారుగానీ, అన్ని వార్డుల్లో అభ్యర్థుల్ని నిలబెట్టడంలో గట్టి ప్రయత్నం కనిపించడం లేదు. ఇదే అంశం లక్ష్మణ్ ముందు ప్రస్థావిస్తే ఆయనేమంటున్నారో తెలుసా… దాదాపు అన్ని స్థానాల్లో భాజపా అభ్యర్థులున్నారు, కొన్ని చోట్ల సాంకేతిక కారణాల వల్ల తమ పార్టీ సానుభూతిపరులు నిలబడ్డారన్నారు. అంటే, స్వతంత్రుల్ని తమ అభ్యర్థులుగా చెప్పుకుంటున్న పరిస్థితి. కింది స్థాయిలో పకడ్బంధీగా చెయ్యాల్సినవి వదిలేసి… జాతీయ నేతలతో ప్రచారమంటే ఉపయోగం ఉంటుందా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close