చైతన్య: మళ్లీ బీజేపీ గెలిస్తే “గాడ్సే”నే జాతిపిత..!

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌కు… జాతిపిత ఎవరు..?. ఆ సంస్థ గురించి… తెలిసిన వాళ్లు.. ఆ సంస్థ లోపల అంతర్గత వ్యవస్థ భావజాలం గురించి తెలిసిన వాళ్లు.. మొదటగా చెప్పేది.. నాథూరాం గాడ్సే పేరు మాత్రమే. మహాత్మాగాంధీ పేరు కాదు. ఆ సంస్థ భావజాలం..అలా వ్యాపిస్తూనే ఉంది. దేశం మొత్తం మహాత్మగాంధీని… జాతిపితగా కొలుస్తూ ఉంటే.. ఒక్క ఆరెస్సెస్.. ఆ సంస్థ అనుబంధ సంఘాలు.. బీజేపీ నేతలు మాత్రం.. వ్యతిరేకిస్తూ ఉంటారు. ప్రజల ముందు… కొంత మంది నేతలు… మహాత్ముని గురించి గొప్పగా చెబుతూంటారు కానీ.. అదంతా.. పైపై రాజకీయం. వారి అసలు భావజాలం మాత్రం గాడ్సే దగ్గరే ఉంటుంది.

గాంధీని కాల్చి చంపిన “హిందూ మహాసభ”

ఉత్తరప్రదేశ్ లో గాంధీ వర్థంతిని అఖిల భారత హిందూ మహాసభ…శౌర్య దివస్ గా పాటించింది. మహాత్ముని చిత్ర పటం కట్టిన… బొమ్మను.. రివాల్వర్ తో కాల్పులు జరిపి..నాథూరాం గాడ్సేకు నివాళులర్పించారు. బొమ్మ నుంచి రక్తం కారేలా ఏర్పాట్లు చేసి… గాంధీ బొమ్మ నుండి రక్తం కారుతోందంటూ అలౌకిక ఆనందాన్ని పొందారు. జై గాడ్సే నినాదాలతో హోరెత్తించారు. తమ భావజాలన్ని దేశం మొత్తం చూపించుకోవడానికి మంచి రిజల్యూషన్‌తో వీడియో తీసి… సోషల్ మీడియాలో హైలెట్ చేసుకున్నారు. ఈ “గాంధీ హత్య” ఉదంతాన్ని ఫోటోల రూపంలో వైరల్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో.. బీజేపీ నేతలు, కార్యకర్తలు దీన్ని ఎంతగా సమర్థించుకున్నారేంటే…” గాంధీ మహాత్ముడ్ని” దేశద్రోహిగా చిత్రీకరించేశారు. అదే అభిప్రాయాన్ని విభిన్న కారణాలతో బలీయంగా వినిపించారు. ఆ ఆరెస్సెస్, బీజేపీ నేతల అభిప్రాయాలు.. ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే.. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. మహాత్ముడ్ని దేశద్రోహిగా ప్రకటించి ఆయనను చంపిన నాథూరాం గాడ్సేని… మహాత్మునిగా ప్రకటించాల్సిందేనన్నంత ఆవేశంతో.. అసహనంతో ఉన్నాయి.

మహాత్ముడ్ని చంపిన గాడ్సేని జాతిపితగా ప్రకటిస్తారా..?

చరిత్రను వక్రీకరించడంలో.. బీజేపీ అగ్రనేతలకు… వెన్నతో పెట్టిన విద్య. భారతీయ జనతా పార్టీకి చప్పుకోవడానికి ఒక్కరంటే.. ఒక్క మహానాయకులు లేరు. ఆరెస్సెస్ నేతల గురంచి చెప్పుకోవాలంటే.. వారంతా… బ్రిటిషర్లకు… ఊడిగం చేసిన వారే. దేశానికి సేవ చేసిన మిగిలిన మహానీయులంతా..కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. అందుకే నరేంద్రమోడీ… ఆ మహనీయుల్లో ఒకర్ని దత్తత తీసుకున్నారు. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ పటేల్‌ను ఎంతగా ప్రేమించారంటే.. ఇప్పుడు ఓ పది మంది యువతను.. వల్లభాయ్ పటేల్.. ఎవరంటే.. బీజేపీ నేత అనే చెబుతారు. కానీ.. ఆయన అచ్చమైన కాంగ్రెస్ నేత అని..కొంత మందికే తెలుసు. ఆయన ఆరెస్సెస్‌ను నిషేధించారనే సంగతి ఇంకా చాలా కొద్ది మందికే తెలుసు. అయినా.. తనకు.. తన పార్టీకి ఓ మహాత్ముడు అండగా ఉండాలన్న ఉద్దేశంతో పటేల్‌ను దత్తత తీసుకుని.. ఆయనో బీజేపీ మూల పురుషుడు అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. వేల కోట్లు పెట్టి విగ్రహాలు పెట్టించి… ఓన్ చేసుకుంటున్నారు. అదే సమయంలో… మహాత్ముడు కూడా గుజరాత్‌కు చెందిన వారే కదా.. ! ఆయనను ఎందుకు అలా హైలెట్ చేయలేదు.? జాతిపితగా ఆయనకు ఉన్న ఇమేజ్ ప్రకారం.. ఆ మాత్రం విగ్రహం ఎందుకు పెట్టించలేదు..?. ఆరెస్సెస్ భావజాలంలో గాంధీకి ఉన్న ముద్రే కారణమా..?

గాడ్సే అంటే బీజేపీ నేతలకు అంత ఆరాధన ఎందుకు..?

ఆరెస్సెస్ నాయకులు గాడ్సేను.. దేశభక్తునిగా పూజించడం కొత్త కాదు. చాలా కాలం నుంచి ఉన్నదే. ఆయన పక్కా హిందూ వాది అని.. దేశ విభజకు గాంధీ కారణమన్న కారణంగా.. గాడ్సే గాంధీని చంపేశారని.. రకరకాల పుకార్లు పుట్టిస్తారు. అసలు గాడ్సేకు.. ఓ ధీరత్వాన్ని ఆపాదించడానికి వారు ఏ మాత్రం వెనుకాడరు. గాడ్సేకు.. వినమ్రంగా మోడీ నమస్కరిస్తున్న ఫోటోలు… ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు తమకు ఎదురు లేని ప్రభుత్వాలు దేశంలో ఉన్నాయి కాబట్టి.. వారు ఏ మాత్రం.. వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. తమ భావజాలానికి తగ్గట్లుగా గాడ్సేను గౌరవించడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి రూట్ మ్యాప్ ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటున్నారు.

ఇది బీజేపీ కోరుకుంటున్న భారతమా..?

మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా… ఓ కార్టూన్ వేశారన్న కారణంగానే.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలాంటి..మహాత్ముడ్ని అంతగా కించ పరిచిన వాళ్లపై చర్చలు ఉండవా..?జాతీయ నాయకులూ చిహ్నాలను అవమానపర్చడం శిక్షార్హమైన నేరమని రాజ్యాంగమూ భారత శిక్షాస్మృతీ ఘోషిస్తున్న విషయం యూపీ బీజేపీ ప్రభుత్వానికి తెలిసికతెలియదా? . అంటే తెలుసు… దేశంలో గగ్గోలు రేగిన తర్వాత తూ…తూ మంత్రంగా కేసులు పెట్టారు. కానీ యోగి ప్రభుత్వం తీరు చూస్తూంటే.. గాడ్సేకు భారతరత్న ఇవ్వాలని యోగి ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసేందుకు కూడా సిద్ధపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం బీజేపీ, బీఆర్ఎస్ వెదుకులాట!

బీఆర్ఎస్ ను చుట్టుముడుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. లోక్ సభ ఎన్నికలతో కిందా మీదా పడుతున్న సమయంలోనే మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావం చూపేలా మరో ఉపఎన్నిక వచ్చి పడింది....

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో అనుప‌మ‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న జోరు చూపిస్తోంది. టిల్లు స్క్వేర్‌తో హిట్టు కొట్టాక‌, ఆ ఉత్సాహం మ‌రింత‌గా పెరిగిపోయింది. వ‌రుస‌గా కొత్త సినిమాల‌పై సంత‌కాలు పెడుతోంది. తాజాగా బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జోడీ క‌ట్ట‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close