నాగ‌చైత‌న్య కూడా ఓపెన్ అవ్వాల్సిందేనా?

నాగ‌చైత‌న్య – స‌మంత విడిపోయారు. వాళ్లిద్ద‌రికీ విడాకులు వ‌చ్చి చాలా కాలమైంది. కానీ ఆ వార్త మాత్రం పాత‌బ‌డ‌డం లేదు. ఈ విష‌యం ఇప్ప‌టికీ హాట్ టాపిక్కే. అస‌లు వీరిద్ద‌రూ ఎందుకు విడిపోయారు? కార‌ణాలేంటి? అనే విష‌యాలు ఇప్ప‌టి వ‌రకూ బ‌య‌ట‌కు రాలేదు. `ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే..` అంటూ రొటీన్ డైలాగులు బ‌య‌ట‌కు వ‌చ్చాయి త‌ప్ప‌, అస‌లు కార‌ణం తెలీదు. ఈ విష‌య‌మై నాగ‌చైత‌న్య‌, స‌మంత ఎప్పుడూ మాట్లాడ‌లేదు. స‌మంత అయినా అప్పుడ‌ప్పుడూ న‌ర్మ‌గ‌ర్భంగా కామెంట్లు పెట్టేది. చైతూ అస‌లు స‌మంత ఊసే తీయలేదు. మీడియా ముందుకు వ‌చ్చేట‌ప్పుడు కూడా `నో ప‌ర్స‌న‌ల్ క్వ‌శ్చ‌న్స్‌` అంటూ ముందే ష‌ర‌తు పెట్టేవాడు. దాంతో స‌మంత విష‌యంలో చై మాట్లాడ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న సంకేతాలు అందాయి.

అయితే ఇప్పుడు స‌మంత పూర్తిగా ఓపెన్ అయిపోయింది. కాఫీ విత్ క‌ర‌ణ్‌లో.. విడాకుల గురించి మాట్లాడింది. చై…తో త‌న బంధం అంత అన్యోన్యంగా సాగ‌లేద‌ని సంచ‌ల‌న కామెంట్లు చేసింది. “మా ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం లేదు. ఇద్ద‌రినీ ఒకే గ‌దిలో ఉంచితే అక్క‌డ ఎలాంటి ప‌దునైన ఆయుధాలు, వ‌స్తువులు లేకుండా చూసుకోవాలి“ అని చెప్ప‌డం ద్వారా చై – స‌మంత‌ల బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవొచ్చు. విడాకులు తీసుకొనేట‌ప్పుడు తాను చాలా మ‌నోవేద‌న‌కు గుర‌య్యాన‌ని, త‌న‌కు రూ.250 కోట్ల భ‌ర‌ణం ఇచ్చింది కూడా నిజం కాద‌ని క్లారిటీ ఇచ్చేసింది. దాంతో ఈ విడాకుల వ్య‌వ‌హారంలో త‌న‌పై సానుభూతి షిఫ్ట్ అయ్యేలా చూసుకోగ‌లిగింది.

స‌మంత ఎలాగూ ఓపెన్ అయిపోయింది కాబ‌ట్టి… ఇప్పుడు నాగ‌చైత‌న్య వంతు రావాలి. ఎందుకంటే.. వాద‌న ఎప్పుడూ ఒక‌సైడే వినిపించ‌డం కరెక్ట్ కాదు. స‌మంత అలా చెప్పుకొంటూ పోతే… చై ఇమేజ్ డామేజ్ అవుతుంద‌ని, త‌ప్పంతా త‌న‌దే అని ఒప్పుకొన్న‌ట్టు అవుతుంది. కాబ‌ట్టి.. ఈసారి.. చై కూడా కాస్తో కూస్తో స్పందించే అవ‌కాశం ఉంది. ‘థ్యాంక్యూ’ ఇంట‌ర్వ్యూల‌లో స‌మంత ప్ర‌శ్న‌ని అడ‌క్కుండా చూసుకొన్న చై.. ‘లాల్ సింగ్ చ‌ద్దా’ ప్ర‌మోష‌న్ల‌లో మాత్రం క‌చ్చితంగా స‌మంత‌కు కౌంట‌ర్ ఇస్తాడ‌నే అనిపిస్తోంది. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close