ప్రొ.నాగేశ్వర్ : రాహుల్ పర్యటనతో కాంగ్రెస్‌కు ఒరిగేదేమిటి..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించారు. విస్తృతంగా సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. రాహుల్ పర్యటన ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ నేతలు.. తమకు పూర్వ వైభవం వస్తుందన్న ఉత్సాహన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే రాహుల్ ఒక్క పర్యటనతో వైభవాలు రావు, వైభవాలు పోవు. కానీ రాహుల్ గాంధీ పర్యటన మాత్రం… వర్గ విబేధాలతో ఉన్న కాంగ్రెస్ పార్టీని కొంత కాలమైనా సమైక్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

తెలంగాణలో రాజకీయ సంక్లిష్టత…!

మౌలికంగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవకాశాలు ఉంటాయన్నదానిపై రాహుల్ గాంధీ పర్యటన ప్రభావం చూపుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం ఏకపక్షంగా లేదు. చాలా సంక్లిష్టంగా ఉంది. ఎందుకంటే.. తెలంగాణలో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. కానీ విపక్షంపైన ప్రజల్లో విశ్వాసం కలగడం లేదు. ప్రభుత్వంపైన.. ప్రతిపక్షం ఆశించిన స్థాయిలో అసంతృప్తి పెరగడం లేదు. అదే సమయంలో పాలకపక్షం అనుకున్నంత వీక్‌గా ప్రతిపక్షం లేదు. అందువల్ల రాజకీయ సంక్లిష్టత మనకు తెలంగాణలో కనిపిస్తోంది. ఇందులో కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది… అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం. ఇది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గుర్తించి.. ఎమ్మెల్యేలను హెచ్చరించడం మనం చూశాం. ఎమ్మెల్యేలపై ఉన్నంత వ్యతిరేకత…ముఖ్యమంత్రిపైన లేదు.. ప్రభుత్వంపైన లేదు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..!

తెలంగాణలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి పెరగడానికి ప్రధానంగా… ప్రభుత్వ వైఖరే కారణం. అధికారం అంతా కేంద్రీకృతమయింది. ముఖ్యమంత్రి చేతుల్లోనే సర్వాధికారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలవరు. ప్రజలను కలవడం అనేది లేనే లేదు. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగా ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి అయినా… ఐదువందలు, వెయ్యి మంది ఉన్నా.. వెళ్లి కలిసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఎవరికీ దొరకదు. పది రోజులు..పదిహేను రోజులు వెయిట్ చేసినా.. ఎమ్మెల్యేలకూ అవకాశం దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత పెరుగుతుంది.

అమలు కాని హామీలతో ప్రజల్లో అసంతృప్తి..!

2014లో టీఆర్ఎస్ ఎఫెక్టివ్‌గా మార్కెటింగ్ చేసుకుని ఓట్లు సంపాదించింది.. తెలంగాణ సెంటిమెంట్ మీద. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎంత మేర పని చేస్తుందన్నది కూడా అనుమానమే. దీంతో పాటు.. ఆ ఎన్నికల్లో కొన్ని ఎన్నికల హామీలు కీలక పాత్ర పోషించాయి. ఇందులో ప్రధానమైన హామీలు రెండు పడకగదుల ఇళ్లు, ఉద్యోగాల విషయంలో ఆశించిన ప్రగతి లేదు. రెండు పడక గదుల ఇళ్లు ఎంత మందికి కట్టిస్తారనేది ఇప్పటికీ తెలియదు. అసలు ఆ హామీనే అసాధ్యమైన హామీ. ఎక్కడైనా కొంత మంది ఇళ్లు ఇస్తే… ఇళ్లు రాని మిగతా వాళ్లంతా ప్రభుత్వానికి వ్యతిరేకమవుతారు. ఇది సహజం. రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారులు చాలా తక్కువ మంది ఉన్నారు. వాటి కోసం ఎదురు చూస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. ఈ రెండు పడక గదుల ఇల్లు అనేది ప్రజల్లో అనేక ఆశలు రేపింది. కానీ ఆశల మేరకు నిర్మాణం జరగడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ మాకో అవకాశం ఇవ్వండి.. ఇప్పటికి కొన్ని కట్టి చూపాం.. మళ్లీ అధికారంలోకి వస్తే అందరికీ కట్టిస్తామని చెప్పి నమ్మించగలిగితేనే.. ఓట్లు వస్తాయి. లేకపోతే వ్యతిరేక పెరుగుతుంది.

ప్రభుత్వంపై ఆగ్రహంతో యువత, కౌలు రైతులు..!

ఉద్యోగాల విషయంలోనూ యువత అసంతృప్తితో ఉంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. దాన్ని నిర్వహిస్తున్నారు. కానీ యువతరం ఆశించిన స్థాయిలో నోటిఫికేషన్లు లేవు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలొస్తాయని… తెలంగాణ ఉద్యమసమయంలో నమ్మించారు. కానీ ఆ స్థాయిలో ఉద్యోగాలు రావడం లేదు. ఇక రైతు బంధు పథకం. రైతుబంధు పథకంపై రైతుల్లో యాభై, అరవై శాతం మంది రైతుల్లో సంతృప్తి ఉంది. కానీ.. 30 నుంచి 40 శాతం మంది రైతుల్లో అసంతృప్తి ఉంది. కౌలు రైతులు, పోడు వ్యవసాయం చేసుకునేవారు… భూమి యాజమాన్య హక్కులు లేకపోయినా సాగు చేసుకునేవారు… తమకు రైతు బంధు పథకం అందలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. వీరందరూ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. ఇక దళితులకు..మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకూ వెయ్యి ఎకరాలు కూడా పంపిణీ చేయలేదు. ఇది కూడా వైఫల్యం.

మోడీతో స్నేహం కేసీఆర్‌కు మైనస్.. !

ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక ప్రజాకర్షక హామీలు అమలు చేయలేదు కనుక.. ఆయా వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది. మరో ఇబ్బందికరమైన అంశం ఏమింటంటే.. మోడీకి, బీజేపీకి కేసీఆర్ దగ్గరవుతున్నారనే ప్రచారం. మోడీ ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వరు. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీలకు సమయం ఇస్తారు. వీరు ఎప్పుడు పోతే అప్పుడు సమయం ఇస్తున్నారు. అందుకే అవిశ్వాస తీర్మానాన్ని బలపర్చలేదు… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో మద్దతిచ్చారు. మోడీపై.. 2014 ఎన్నికల్లో పోలిస్తే.. తీవ్ర వ్యతిరేకత ఉంది. ముస్లిం, దళిత ఓటర్లలో మోడీపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. సీమాంధ్ర ఓటర్లలో ఆగ్రహం ఉంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసినందుకు.. సీమాంధ్ర ఓటర్లు బీజేపీని క్షమించడం కష్టమే. వీటన్నింటి మూల్యం… మోడీ మిత్రుడిగా..కేసీఆర్ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇవి క్రమబద్ధంగా… కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందా.. అన్నది ఇక్కడ ముఖ్యం.

ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్…!

తెలంగాణ రాష్ట్ర సమతి ప్రభుత్వంపై.. క్రమబద్దంగా… వ్యతిరేకత పెరిగితే.. ప్రధాన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే కనుక లాభమే. కానీ.. ఆటోమేటిక్‌గా ప్రయోజనం కలుగుతుందా లేదా అన్నదే సందేహం. ఎమ్మెల్యేలు చేయలేకపోవచ్చు కానీ.. ముఖ్యమంత్రి చేస్తారనే… నమ్మకం ప్రజల్లో ఉంటుంది. వీటన్నింటిని కాంగ్రెస్ పార్టీ అధిగమించాల్సి ఉంటుంది. ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం చూస్తే.. ఈ క్రమంలో జరిగిన ప్రయత్నాలేమీ లేవని తెలుస్తోంది. మామూలుగా అయితే దళితులకు భూపంపిణీ పథకంపై.. గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి…ఆ వర్గంతో ఉద్యమాలు చేయవచ్చు. కానీ చేయలేదు. స్టేట్‌మెంట్లు తప్ప… ఎలాంటి పని చేయలేదు. అలాగే .. ఉద్యోగాల విషయంలోనూ.. ప్రకటనలే తప్ప.. ఎలాంటి ఉద్యమ కార్యాచరణ లేదు. అలాగే కౌలు రైతులను సమీకరించలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నమ్మకం ఏమిటంటే.. టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంటే.. అది తమకు ఉపయోగపడుతుందని.. ఆటోమేటిక్‌గా… అధికారం వస్తుందని.. కాంగ్రెస్ నేతలు ఆశల్లో ఉన్నారు.

నేతల తీరు కాంగ్రెస్‌కు ఇబ్బందికరం..!

అలాగే కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల మధ్య ఉన్న విబేధాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. జిల్లాల్లో బలమైన పార్టీల నేతలకు ఒకరంటే ఒకరికి పడదు. అలాగే..కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే ఉంటున్నారు. వీరికి ఒకరంటే ఒకరికి పడదు. ఇవన్నీ కలిసి.. కాంగ్రెస్ పార్టీ.. టీఆర్ఎస్‌పై పోరాడే శక్తిని కోల్పోయేలా చేస్తున్నాయి. టీఆర్ఎస్‌ను కాంగ్రెస్ ఓడిస్తుందనే నమ్మకాన్ని కలిగించలేకపోతున్నారు. ఈ లోపల టీఆర్ఎస్.. రాహుల్ పర్యటనకు అడ్డంకులు సృష్టించడం వల్ల కాంగ్రెస్ పార్టీపై సానుభూతి పెరుగుతుంది. రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చి పోతే.. తెలంగాణ ప్రభుత్వం తలకిందులవుతుందా..?. ప్రజల్లో ఓ రాంగ్ ఇంప్రెషన్ టీఆర్ఎస్ పెంచుకుంటోంది. రాహుల్ పర్యటన వల్ల కాంగ్రెస్ బలపడుతోందని.. టీఆర్ఎస్ భయపడుతోందన్నట్లుగా.. ఆ పార్టీ .. ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి.

టీఆర్ఎస్ చర్యలను కాంగ్రెస్ సమర్థంగా వినియోగించుకుంటుందా..?

సహజంగా అయితే… రాహుల్ పర్యటనకు… ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. కాంగ్రెస్ పార్టీ అధినేతకు గౌరవం ఇవ్వాలి. కానీ అడ్డంకులు సృష్టించడం ఎందుకు..?. రాహుల్ గాంధీ పర్యటనకు అడ్డంకులు సృష్టించడం కూడా..మోడీని సంతృప్తి పరచడానికే అనే అభిప్రాయం ఎందుకు కల్పించాలి..?. లేదా కాంగ్రెస్ పార్టీకి… రాహుల్ గాంధీకి… ప్రభుత్వం, టీఆర్ఎస్ భయపడుతోందనే భావన ఎందుకు కల్పించాలి..?. ముఖ్యమంత్రి ఉస్మానియాకు రాలేని పరిస్థితి. ఏ మంత్రి కూడా రాలేకపోతున్నారు. ఇది సెల్ఫ్ గోల్‌గా మారింది. ఓవరాల్‌గా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా ఉపయోగించుకుంటుంది.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా పెంచుతుందన్నదానిపై.. భవిష్యత్ కాంగ్రెస్ రాజకీయం ఆధారపడి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close