ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తో ఎమ్మెల్యే టిక్కెట్ వ‌స్తుంద‌ట‌..!

సినిమాలు తీస్తే నిర్మాత‌లు అవుతారు. అంతేగానీ, ఎమ్మెల్యేలు అవుతారా..? ఏమో, అవుతారేమో… ఆయ‌న తీరు చూస్తే అలానే ఉంది. సినిమా థియేట‌ర్ టిక్కెట్ కౌంట‌ర్ నుంచీ మొద‌లుపెట్టి, ఎమ్మెల్యే టిక్కెట్ ప‌ట్టేయాల‌న్న‌దే ఆయ‌న వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇంత‌కీ, ఆ నాయ‌కుడు ఎవ‌రంటే.. రాకేష్ రెడ్డి. అలా చెప్పే కంటే… ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత అని చెబితే ఈజీగా గుర్తు ప‌ట్టొచ్చు. స‌రిగ్గా ఆయ‌న కోరుకుంటున్న గుర్తింపూ ఇదే. అందుకే, ఏరికోరి మ‌రీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మను ఎంచుకున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం గురించి టీడీపీ నేత‌లు సీరియ‌స్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక సినిమాను సినిమాగా తీయాలీ అనే జాన‌ర్ నుంచి వివాదాస్ప‌దంగా తీస్తే చాలు అనే స్థాయికి వ‌ర్మ వ‌చ్చేశారు. ద‌ర్శ‌కుడిగా దీన్ని ఆయ‌న ఎదుగుద‌ల అనాలో, దిగ‌జారుడు అనాలో అనేది వేరే చ‌ర్చ‌!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డి వైకాపా నాయ‌కుడు. ఈయ‌న గ‌తంలో సినిమాలు తీసిన అనుభ‌వం లేదు. బెంగ‌ళూరులో ఒక రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ప‌ల‌మ‌నేరు నియోజ‌క వ‌ర్గానికి చెందిన‌వారు. ఇదే నియోజ‌క వ‌ర్గం నుంచి వైకాపా టిక్కెట్ పై అమ‌ర్ నాథ్ రెడ్డి గెలిచారు. కానీ, త‌రువాత ఆయ‌న జ‌గ‌న్ తో విభేదించి టీడీపీలో చేరిపోయి, మంత్రి అయ్యారు. ఆయ‌న వెళ్లాక వైకాపాకి ప‌ల‌మ‌నేరులో గ‌ట్టి ఎదురుదెబ్బే త‌గిలింది. దీంతో పార్టీ స‌మ‌న్వ‌యక‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వారే పెద్ద దిక్కు అయ్యారు. అయితే, వారంద‌రూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైకాపా నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ముందు త‌మ బ‌ల‌మేంటో ప్ర‌ద‌ర్శించుకోవాల్సిన ఒక అనివార్య‌త ఏర్ప‌డింది. అందుకే, సమన్వయకర్తల్లో ఒక‌రైన రాకేష్ రెడ్డి నిర్మాత అవ‌తారం ఎత్తారు అంటున్నారు! ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని విలన్ గా చూపించొచ్చ‌నీ, ఆ ర‌కంగా వైకాపా ఆశీస్సులు పొందొచ్చ‌నే ఉద్దేశంతోనే ఆయ‌న నిర్మాతగా మారారని చెప్పుకుంటున్నారు. త‌ద్వారా ప‌ల‌మ‌నేరు టిక్కెట్ త‌న‌కే ద‌క్కుతుంద‌నేది ఆయ‌న వ్యూహంగా తెలుస్తోంది.

రాకేష్ రెడ్డిగానీ ఆయ‌న అనుచ‌ర వైకాపా గ‌ణంగానీ మిస్ అవుతున్న లాజిక్ ఒక‌టుంది. ప‌ల‌మ‌నేరులో మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డికి మంచి ప‌ట్టుంది. ఆయ‌న టీడీపీలో చేర‌డం, ఆ పార్టీకి చాలా ప్ల‌స్ అయింది. అధికార పార్టీలో చేరిన త‌రువాత ఆయ‌న ప‌ట్టు మ‌రింత పెరిగింద‌నే చెబుతున్నారు. ఇలాంటి నియోజ‌క వ‌ర్గంలో వైకాపా నుంచి టిక్కెట్ ఆశిస్తే… తీయాల్సింది సినిమా కాదు, తీసుకుని రావాల్సిన రామ్ గోపాల్ వర్మను అంతకన్నా కాదు. నియోజ‌క వ‌ర్గంపై దృష్టి పెట్టాలి. కేడ‌ర్ బ‌లోపేతంపై శ్ర‌ద్ధ తీసుకోవాలి. అధికార పార్టీ లోపాల‌పై క‌న్నేసి, కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాలి. దీంతోపాటు పార్టీలోని ఇత‌ర నేత‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకోవాలి. అమ‌ర్ నాథ్ రెడ్డిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎదుర్కొనే స్థాయి నాయ‌కుడిగా చూపించుకోవాలి. ఇవ‌న్నీ వ‌దిలేసి.. కేవ‌లం ఒక సినిమా తీసి జ‌గ‌న్ ను సంతృప్తి ప‌ర‌చి టిక్కెట్ ద‌క్కించుకోవ‌డ‌మే గొప్ప వ్యూహం అన్న‌ట్టుగా ఆ నేత‌ వైఖ‌రి క‌నిపిస్తోంది. అయినా, రాకేష్ రెడ్డి ఆశిస్తున్న స్థాయిలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా రామ్ గోపాల్ వ‌ర్మ సినిమా తీస్తార‌న్న న‌మ్మ‌కం ఏముంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close