ఈ నెల 17 న ‘యోధ’ డయగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం

‘యోధ’ లైఫ్ లైన్ డయగ్నొస్టిక్ సెంటర్’ ఈ నెల 17న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య మంత్రి హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి, మాజీ క్రికెటర్ హజరుద్దీన్, పుల్లెల గోపీచంద్, హారిక ద్రోణవల్లి హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. మెటబోలమిక్స్, ప్రోటియోమిక్స్, మాలిక్యులర్ డయగ్నస్టిక్‌తో పాటు రేడియాలజీ సర్వీసులు కూడా ఒకే చోట అందుబాటులో ఉండటమే తమ ప్రత్యేకత అని సంస్థ పేర్కొంది. అంతేకాకుండా కోవిడ్-19 కి సంబంధించిన ‘బూస్టర్ డోస్’శరీరంపై ఎంత మేరకు పనిచేస్తుంది, దాని ఫలితాలు ఎలా వున్నాయన్న దానిపై కూడా కచ్చితమైన ఫలితాన్ని తాము చెబుతామని సంస్థ తెలిపింది. అంతేకాకుండా అన్ని రకాల జబ్బులకు సంబంధించిన డయాగ్నోస్ చేస్తామని పేర్కొన్నారు. వీటితో పాటు శరీరానికి వచ్చే అన్ని రకాల ఇబ్బందులను ముందే పసిగట్టే పరికరాలు, ప్రసవ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తాము తెలియజేస్తామని సంస్థ పేర్కొంది. వీటన్నింటికీ సరైన మందులు, సరైన డోసులను కూడా తాము సూచిస్తామని సంస్థ నిర్వహకులు హామీ ఇస్తున్నారు. ‘యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్’ సుధాకర్ కంచర్ల నేతృత్వంలో నడుస్తోంది. అమెరికాలో అత్యున్నత ప్రమాణాలతో మూడు డయగ్నోస్టిక్ సెంటర్లతో పాటు ఐటీ కంపెనీలకు కూడా ఈయన సారధ్యం వహిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ రూ. 14వేల కోట్లు మంగళవారం ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పడం లేదేంటి ?

తెలంగాణ ఎన్నికల సమయంలో రైతు బంధు రాజకీయం జరిగింది. ఎన్నికల సంఘం నిధులు జమ చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ హరీష్ రావు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో మళ్లీ...

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close