వైసీపీ ఎమ్మెల్యేలకు “జగన్ సర్వే”లో పేరు వస్తేనే టిక్కెట్ !

వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ టిక్కెట్ కావాలంటే ఖచ్చితంగా సర్వేలో పేర్లు రావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. మూడేళ్ల కిందట గెలిచినప్పుడు వైసీపీఎల్పీ సమావేశం పెట్టిన జగన్.. ఇప్పుడు మరోసారి భేటీ నిర్వహించారు. మళ్లీ నిర్వహిస్తారో లేదో స్పష్టత లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికల గురించి.. టిక్కెట్ల గురించి.. మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లడంలేదని.. జనంలోకి వెళ్తే వారికే సర్వేల్లో పేర్ల్లు వస్తాయని.. వారికే టిక్కెట్లు ఇస్తానని జగన్ తేల్చి చెప్పారు. మూడేళ్లు వేరు.. ఇక నుంచి వేరని … చెబుతూ.. ఎమ్మెల్యేలు ఏమేం చేయాలో దిశానిర్దేశం చేశారు. ఇందులో బూత్ కమిటీల్ని ఉన్న పళంగా బలోపేతం చేసుకుని.., ఆ కమిటీల్లో సగం మంది మహిళలకు చాన్సిచ్చి.. వారందరితో ఇంటింటికి తిరిగి పథకాల గురించి ప్రచారం చేయడం కీలకమని స్పష్టం చేశారు.

ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ఇంటింటికి తిరిగితే వచ్చే ప్రయోజనం రాదన్నారు. ఇక వాలంటీర్లకు సన్మానాలు.. గ్రామ సచివాలాయలను పరిశీలించడం వంటి వాటిని కూడా సూచించారు. అన్నీ సమక్రంగా చేస్తేనే సర్వేలో పేర్లు వస్తాయన్నారు. అయితే చాలా మందిఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్ ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. బిల్లులు రావడం లేదన్నారు. దీనిపై జగన్.. ఏప్రిల్‌లో అందరి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేకు రెండు కోట్ల నిధి కూడా ఇస్తామన్నారు. అయితే ఆ రెండు కోట్లతో ఎలాంటి పనులు చేయలేమని.. వారిలో అసంతృప్తి వ్యక్తంమయింది.

ప్రతీ సారి పార్టీ కోసం పని చేసేందుకు పీకే వస్తారని సీఎం జగన్ ఈ సారి చెప్పలేదు. సర్వేలు ఎవరు చేస్తారో కూడా చెప్పలేదు. అయితే పీకే టీం మాత్రం త… వైసీపీకి పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పీకే పట్టించుకోకపోయినా ఆయన టీం ఇప్పటికే సర్వేలు ప్రారంభించిందని అంచనా వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా హింట్ ఇచ్చారు. అయితే అది ఉగాదికా… ప్లీనరీ అయిపోయిన తర్వాత అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆశావహుల్లో నిరాశ కనిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close