వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎవర్ని కాపాడటానికి ప్రయత్నిస్తోందని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. వివేకా వర్థంతి సందర్భంగా పులివెందులలో ఆయనకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో వివేకా హత్య కేసులో దర్యాప్తు లోపాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అర్జున్ రెడ్డితో పాటు కిరణ్ యాదవ్ అనే వారిని సీబీఐ ప్రశ్నించిన తర్వాత కొత్త ఆధారాలేం లేవని చెప్పి దర్యాప్తును సీబీఐ ముగించేసింది. అదే విషయం సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు మిగిలిన పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించి ట్రయల్ ప్రారంభించాలని ఆదేశించింది.
ఈ క్రమంలో తన వద్ద ఉన్న ఆధారాలతో సీబీఐ లోపభూయిష్టంగా దర్యాప్తు చేసిందని సునీత మీడియాకు వివరించారు. సీబీఐ ప్రశ్నించిన వారు పరస్పర విరుద్ధమైన స్టేట్ మెంట్స్ ఇచ్చినా సీబీఐ పట్టించుకోలేదన్నారు. అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ చెప్పింది రికార్డు చేసుకుని వెళ్లారని దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా అని సునీత ప్రశ్నించారు. అనేక వివరాలు అనుమానాస్పదంగా ఉన్నా సీబీఐ దర్యాప్తు చేయడం లేదన్నారు. సీబీఐ ఎవర్ని కాపాడటానికి ప్రయత్నిస్తోందని సునీత ప్రశ్నించారు. ఈ సందర్భంగా సునీత తన వద్ద ఉన్న ఫోన్ కాల్ డీటైల్స్.. ఇతర ఆధారాలను మీడియాకు వెల్లడిడంచారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎన్నో అనుమానాలకు సీబీఐ ఇంకా క్లారిటీ తీసుకు రాలేదు. తన తండ్రి హంతకులకు చట్టపరంగా శిక్ష పడేలా చేయడానికి ఏళ్లుగా సునీత పోరాడుతున్నారు. ఆ పోరాటం ఎప్పటికప్పుడు వృధా అవుతూనే ఉంది. అసలు నిందితుల్ని..సూత్రధారుల్ని పట్టుకునేలా చేసేందుకు ఆమె అత్యున్నత న్యాయస్థానం వరకూ వెళ్లిపోరాడినా ఊరట లభించలేదు. ఇప్పుడు అసలు ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది.
