కలాం పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు !

ఏపీలో మహామహులైనా వైఎస్ఆర్ తర్వాతే. దేశానికి వారెంత సేవలు చేసినా డోంట్ కేర్. ఫుట్ పాత్ దగ్గర్నుంచి పారిశ్రామిక విధానాల వరకూ అన్నింటికీ వైఎస్ఆర్ పేరే. తాజాగా విశాఖలో బీచ్ వ్యూ పాయింట్ కు కూడా వైఎస్ఆర్ పేరు పెట్టారు. అంతకు ముందు ఈ వ్యూ పాయింట్‌కు అబ్దుల్ కలాం పేరు ఉండేది. దంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా దుమారం రేగింది. ప్రభుత్వ పేర్ల మార్ప కక్కుర్తిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఈ వ్యూ పాయింట్ సీతంకొండ సమీపంలో ఉంటుంది. కి ఈ వ్యూపాయింట్ ను గతంలో ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలేదు. వైజాగ్ వాలంటీర్స్ అనే స్వచ్చంద సంస్థ .. అందరి సహకారంతో స్వల్పంగా అభివృద్ధి చేసింది. అబ్దుల్ కలాం పేరు పెట్టి.. వ్యూ పాయింట్‌ను అభివృద్ధి చేశారు. ఇటీవల G20 సదస్సు సుందరీకరణలో కేంద్ర నిధులు పెట్టి అభివృద్ధి చేశారు. పనిలో పనిగా కలాం పేరు తీసేసి.. వైఎస్ఆర్ పేరు పెట్టారు.

ఇలాంటి దారుణం ఏదో చేయబోతున్నారని తెలిసి వైజాగ్ వాలంటీర్స్ సంస్థ ప్రతినిధులు సోషల్ మీడియాలో కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. శాశ్వతంగా అధికారికంగా కలాం పేరు పెట్టాలని ఆన్ క్యాంపైన్ చేస్తున్నారు. కానీ వీరిని ప్రభుత్వం పట్టించుకోలేదు. గతంలో ఓ సారి విద్యార్థులకు ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు అబ్దుల్ కలాం పేరు తీసేసి వైఎస్ పేరు పెట్టారు. ఆ సమయంలో దుమారం రేగడంతో.. సీఎం జగన్ సీరియస్ అయ్యారని కబుర్లు చెప్పి.. మళ్లీ కలాం పేరు పెట్టారు. మరి ఈ బీచ్ వ్యూ పాయింట్ విషయంలో ఏం చేస్తారో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close