తెలంగాణ సంగతి 2024లో తేల్చుకుంటుందట వైసీపీ ..!

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నామినేషన్ల గడువుకు రెండు రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. దాని సారాంశం ఏమిటంటే.. తాము.. తమ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఇప్పటి వరకూ పోటీ చేస్తారని ఎవరూ అనుకోలేదు. కనీసం మీడియాలో కూడా.. పోటీ చేస్తుందా లేదా.. అన్న కథనాలు కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం… తన ఎన్నికల ధీరత్వాన్ని ప్రెస్ నోట్ ద్వారా విడుదల చేశారు. నిజానికి రాజకీయ పార్టీ అంటే… ఓట్లు వచ్చినా.. రాకపోయినా పోటీ చేయడానికే పరుగులు పెడతారు..? పరిమిడ్ పార్టీ అని ఒకటి ఉంటుంది.. ! ఎవరికీ తెలియదు. కానీ ఆ పార్టీ తరపున అభ్యర్థులు మాత్రం నిలబడుతూ ఉంటారు. ఎందుకని… ? రాజకీయ పార్టీ కాబట్టి…! మరి వైసీపీ ఎందుకు కాడి పడేసింది..?

తెలంగాణలో ప్రతిపక్ష కూటమి ఓటమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్‌కు అండగా నిలవాలని వైసీపీ నిర్ణయించుకుంది. ప్రతిపక్ష పాత్ర కోణంలో చూస్తే ఇది విచిత్రంగా అసహజంగా కన్పిస్తుంది. దీనిపై పార్టీ ఇచ్చిన ప్రకటన మరింత విడ్డూరంగా ఉంది. పార్టీ దృష్టంతా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలపై ఉన్న కారణంగా తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఎప్పుడో ఆర్నెల్ల తర్వాత జరిగే ఎన్నికలకు సిద్ధమయ్యే ప్రక్రియలో ఇప్పుడు జరిగే ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉండాలో …తెలంగాణలో పోటీ చేస్తున్న కారణంగా ఆర్నెల్ల తర్వాత జరిగే ఆంధ్ర ఎన్నికల సన్నద్ధతకు వచ్చే ముప్పు ఏంటో ఎవరికీ అర్ధం కాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మిగతా చోట్ల సంగతేమో కానీ ఖమ్మం జిల్లాలో మంచి ఫలితాలు సాధించింది. మూడు ఎమ్మెల్యే సీట్లు.. ఓ ఎంపీ స్థానాన్ని గెల్చుకుది. తర్వాత వారందరూ మెల్లగా.. టీఆర్ఎస్‌కు వెళ్లిపోయినా.. .. వైసీపీ అగ్రనేతలు లైట్ తీసుకున్నారు. అదేదో తామే పంపించినట్లుగా ఊరుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా టీఆర్ఎస్‌కు నొప్పి కలిగేలా.. వైసీపీ ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు కూడా.. తమ ఎంపీనీ ఎమ్మెల్యేలనూ గుంజుకుని తన ఉనికిని దెబ్బతీసిన కేసీఆర్ కే ఎన్నికల్లో మేలు జరగాలని కోరుకుంటోంది. అందుకే.. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

అసలు ఇందులో కొసమెరుపేమిటంటే.. 2024 ఎన్నికలకు వైసీపీ సంస్థాగతంగా పటిష్టమై సిద్ధమౌతుందట.. అప్పుడు పోటీ చేస్తారట. ఇప్పటికే వైసీపీ కార్యకర్త అనే వారు లేకుండా పోయారు. మిగిలిన వారితో ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళకపోతే..ఐదేళ్ళ తర్వాత పార్టీ ఉంటుందా? అయితే ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి విచిత్రంగా కన్పిస్తున్నా పార్టీకి ఇదే చెప్పక తప్పలేదు. నిజం ఎలాగూ బయటకు చెప్పలేరు. టీడీపీ భాగస్వామిగా ఉంది కాబట్టి… కాంగ్రెస్ గెలవకూడదనేది జగన్ కోరిక. ఒక వేళ తెలంగాణలో మహాకూటమి గెలిస్తే.. ఏపీలో చంద్రబాబుకు 2019 ఎన్నికలు నల్లేరుపై నడక అవుతాయనే భయం వెంటాడుతోంది. అందుకే… 2024లో తేల్చుకుందామని డిసైడై.. ఇప్పటికి సైడ్ ఇచ్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close