హోదా సాధన పోరాటంలో చిత్తశుద్ధి లేనిది ఎవరికి..?

ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఢిల్లీలో పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి… ప్ర‌త్యేక హోదా కావాలంటూ నినాదాలు చేశారు. అనంత‌రం విజ‌య‌సాయి మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్యేక హోదా విష‌య‌మై తెలుగుదేశం ఎంపీల‌కు చిత్త‌శుద్ధి లేద‌ని విమ‌ర్శించారు. స‌భ‌లో టీడీపీ ఎంపీలు నిర‌స‌న‌లు కూడా తెల‌ప‌డం లేద‌నీ, కొంద‌రైతే స‌మావేశాల‌కు రావ‌డం లేద‌న్నారు. అంతే, అక్క‌డితో హోదా అంశ‌మై వైకాపా పోరాటం టాపిక్ అయిపోయింది. అక్క‌డి నుంచి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై విమ‌ర్శ‌ల చేయ‌డం ప్రారంభించారు!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల ముందే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చేతులెత్తేశార‌న్నారు! గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఈవీఎమ్ ల‌ను న‌మ్ముకుని వెళ్లార‌నీ, వైకాపా కంటే ఐదు ల‌క్ష‌ల ఎక్కువ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వ‌చ్చార‌న్నారు. ఈవీఎమ్ ల‌ను ట్యాంప‌ర్ చేసి అధికారంలోకి వ‌చ్చార‌ని ఆరోపించారు. కానీ, ఈరోజున ఈవీఎమ్ ల‌పై ఆయ‌నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నార‌నీ, గ‌డ‌చిన నాలుగేళ్లూ భాజ‌పాతో దోస్తీ ఉన్నంత‌కాలం దీనిపై ఎందుకు మాట్లాడ‌లేద‌న్నారు. మ‌రోసారి ఈవీఎమ్ ల‌ను మేనేజ్ చేసే అవ‌కాశం భాజ‌పా క‌ల్పించ‌ద‌న్న అప‌న‌మ్మ‌కంతోనే ఇలా మాట్లాడుతున్నార‌ని విజ‌య‌సాయి విమ‌ర్శించారు. అంటే, ఎన్నిక‌ల‌కు నాలుగైదు నెల‌ల ముందే త‌న ఓట‌మిని ఒప్పుకున్న‌ట్టు అని సీఎంని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వైకాపా ఎంపీలు పార్ల‌మెంటు ముందు ధ‌ర్నాకి దిగింది దేనికీ… హోదా కావాల‌నే డిమాండ్ తో క‌దా! మ‌రి, అదే ఆవ‌ర‌ణ‌లో మీడియా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి విజ‌య‌సాయి మాట్లాడుతున్న‌దేంటీ… చంద్ర‌బాబు- ఈవీఎమ్ ల గురించి! మరి, ప్ర‌త్యేక హోదా పోరాటం ఏమైన‌ట్టు, కేంద్రాన్ని ఏ ర‌కంగా ఈయ‌న నిల‌దీస్తున్న‌ట్టు, ఈ ఇద్ద‌రూ ధ‌ర్నా ద్వారా భాజ‌పాకి ఇచ్చిన సంకేతాలేంటి… ఇవి క‌దా మాట్లాడాల్సిన‌వి! ఇవ‌న్నీ వ‌దిలేసి వేరేది మాట్లాడ‌తారేంటి..? ఇంకోటి, టీడీపీ ఎంపీలకు ప్ర‌త్యేక హోదా సాధ‌న‌పై చిత్త‌శుద్ధే లేద‌నేశారు. పార్ల‌మెంటు గత స‌మావేశాల్లో… ప్ర‌త్యేక హోదా కోసం స‌భ‌లో మాట్లాడింది ఎవ‌రు..? ఎంపీలు గ‌ల్లా జ‌య‌దేవ్‌, రామ్మోహ‌న్ నాయుడు స‌భ‌లో ప్ర‌ధాని మోడీని నిల‌దీసిన క్ర‌మం ఎంత‌గా చ‌ర్చ‌నీయం అయిందో గుర్తులేదా..? ఆ మాట‌కొస్తే… ఇప్పుడు లోక్ స‌భ‌లో ప్ర‌త్యేక హోదా గురించి వైకాపా త‌ర‌ఫున మాట్లాడ‌టానికి ప్రాతినిధ్య‌మే లేదు. స‌రే, తమ ఎంపీలు ప‌ద‌వులను త్యాగం చేశారని వైకాపా నేతలు చెప్పుకుంటారు. మరి, ఆ త్యాగం విజ‌య‌సాయి రెడ్డి ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి ఎందుకు వ‌ర్తించ‌లేదు..? గ‌త పార్ల‌మెంటు స‌మావేశాలుగానీ, అంత‌కుముందుగానీ… పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో మీడియా ముందు ఏనాడైనా ‘హోదా ఎందుకు ఇవ్వ‌రూ’ అంటూ కేంద్రాన్ని విజ‌యసాయి బ‌ల్ల‌గుద్ది నిల‌దీశారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close