వైసీపీలో “సోషల్ మీడియా” సంక్షోభం !

వైసీపీని తండ్రీకొడుకులు శంకరగిరి మాన్యాలు పట్టించేస్తున్నారు. తండ్రి జగన్ రెడ్డి కి ముఖ్య సలహాదారులుగా ఉంటూ డీ ఫ్యాక్టో సీఎంగా అధికారాలు చెలాయిస్తూ … ఇదేం పాలన గురూ అని ప్రజలు అసహ్యించుకునేలా చేస్తున్నారు. ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాను కార్యకర్తలకు నరకం చేసి పెట్టారు. చివరికి డబ్బులివ్వండి మహా ప్రభో అని శ్రీరెడ్డి లాంటి వాళ్లు అడుక్కోవాల్సిన పరిస్థితికి తెచ్చారు.

వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా పెయిడ్ ప్రమోషన్ల మీద నడుస్తుంది. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్లో స్వచ్చందంగా ఆ పార్టీ కోసం పోస్టులు షేర్ చేసే వారు ఐదు శాతం మంది కూడా ఉండదు. మిగతా 95 శాతం మంది పేమెంట్‌కు పని చేస్తున్నారు. ఇందు కోసం ఓ యాప్ ఉంది. అయితే ఈ పేమెంట్ కాకుండా… కాస్త ఫాలోయర్లు.. ప్రజల్లో గుర్తింపు ఉన్న వారికి ప్రత్యేక ఖాతాలు ఉంటాయి. చివరికి అాలాంటి వారికి కూడా పేమెంట్ ఇవ్వడం లేదు. కంటెంట్ వైసీపీ ఆఫీసు నుంచి వస్తే… వీళ్లు పోస్ట్ చేస్తారు. శ్రీరెడ్డి, ఆర్జీవీ లాంటి వాళ్లు ఈ జాబితాలో ఉంటారు. ఆర్జీవీ ఇంకా పేమెంట్స్ గురించి బయటపడలేదు కానీ… శ్రీరెడ్డి మాత్రం బ్లాస్ట్ అయ్యారు.

డబ్బులివ్వండి జగనన్న అని.. శ్రీరెడ్డి పోస్టు పెట్టిన తర్వాత కొన్ని వందల మంది ఆమెకు మద్దతు పలుకుతూ పర్సనల్ గా మెసెజ్ చేశారు. ఇదే విషయాన్ని శ్రీరెడ్డి ట్విట్టర్ లో ప్రకటించారు. తర్వాత సజ్జల భార్గవ నుంచి ఏమైనా హామీ వచ్చిందో..లేకపోతే డబ్బులు ఇచ్చారో కానీ.. ఆ పోస్టుల్ని తీసేశారు. మళ్లీ బూతు పోస్టులు పెట్టారు. అంటే బెదిరిస్తే తప్ప చేసిన పనికి డబ్బులు రాలేదన్నాట.

సజ్జల భార్గవరెడ్డి తండ్రిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియా ఇంచార్జ్ పోస్టులోకి వచ్చారు. కానీ ఆయనకు అసలు పరిజ్ఞానం లేదని.. పండిత పుత్ర పరమశుంఠ టైపులో .. సజ్జల సీఎంను గుప్పిట్లో పెట్టుకుంటే ఆయన కుమారుడ్ని ఇతరులు గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతూంటారు. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి అసలు సోషల్ మీడియా ఇంచార్జ్ గా పని చేస్తూంటాడు. సజ్జల భార్గవకు ఇమేజ్ పెంచుతున్నట్లుగా కొన్ని ఫోటోలు లీక్ చేయిస్తూ ఉంటాడు. ఇది చాలనుకుని సజ్జల భార్గవ ఊరుకుంటాడు. కానీ అక్కడ సోషల్ మీడియా పరువు రోడ్డున ప డిందని అర్థం చేసుకోలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close