ఆత్మసాక్షి సర్వే : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే పైచేయి !

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటోంది. జనం మూడ్ ఎలా ఉంది? ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఎమ్మెల్యేల పనితీరుపై ఎలాంటి నిర్ణయానికి వచ్చారు? నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? ఇలాంటి వాటిపై ప్రజల్లో ఆసక్తి ఏర్పడుతోంది. సీఎంజగన్మోహన్ రెడ్డి మాసివ్ విక్టరీతో అధికారంలోకి వచ్చారు. ఓట్ల పరంగా యాభై శాతానికిపైగా.. సీట్ల పరంగా ఎనభై శాతానికిపైదా ఆయన పార్టీకి లభించింది. మూడేళ్ల తర్వాత ఆయన తనకు ఓట్లేసినందర్నీ సంతృప్తి పరిచారా ? కొత్తగా ఇతరుల్నీ ఆకట్టుకున్నారా ? లేక ఉన్న వారినే కోల్పోయారా? వంటి అంశాలపై ఆత్మసాక్షి గ్రూప్ సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలు ఇవి.

మూడేళ్లలో 4.7 శాతం ఓట్లు కోల్పోయిన వైఎస్ఆర్‌సీపీ !

ఆత్మ సాక్షి గ్రూప్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మే 19 వరకూ ఉన్న పరిస్థితిని చూస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 49.95 శాతం ఓట్లను సాధించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్‌సీపీకి 45.25 శాతం ఓట్లు వస్తాయని ఆత్మసాక్షి అంచనా వేసింది. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన ఓటు అటు టీడీపీ, జనసేన మధ్య చీలిపోయింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 39.26శాతం ఓట్లు రాగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే 3.49శాతం పెంచుకుని 42.75 శాతం ఓట్లు సాధించగలదు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమవుతున్న ఓట్లన్నీ టీడీపీకి రావడంలేదు. జనసేన పార్టీ గత ఎన్నికల్లో 6.7 శాతం ఓట్లు సాధించింది. కానీ ఇప్పుడు ఆ పార్టీ 8.75 శాతం ఓట్లు సాధించగలదని అంచనా వేస్తున్నారు. అంటే2.05 శాతం ఓటింగ్ జనసేనకు పెరుగుతుంది. కాంగ్రెస్, బీజేపీ , ఇతరులు కలిసి 1.5 శాతం ఓట్లు సాధిస్తారు. ఇక అత్యంత కీలకంగా సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఏ అభిప్రాయం చెప్పకుండా ఎన్నికల్లో తమ ఓటును సైలెంట్‌గా వినియోగించుకుంటారు. ఇలాంటి వారి ఓట్ల శాతం 1.75 శాతంగా ఉంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్‌సీపీదే పైచేయి !

మూడేళ్లలో 4.7 శాతం ఓట్లు పోగొట్టుకున్నప్రభావం వైసీపీపై గట్టిగానే పడనుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి 75 నుంచి 77 సీట్లు లభిస్తాయి. తెలుగుదేశం పార్టీకి 60-62 సీట్లు వస్తాయి. జనసేన పార్టీ 6 – 7 స్థానాల్లో విజయం సాధిస్తుంది. ఇతరులకు ఒక్క స్థానం వస్తుంది. 18-21 స్థానాల్లో గెలుపెవరిదో చెప్పలేనంత తీవ్రమైన పోటీ ఉంటుంది. ఎలా చూసినా .. తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ ఓట్ షేర్.. ఎక్కువ సీట్లు వైఎస్ఆర్‌సీపీకి కనిపిస్తున్నాయి.

వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై ఎక్కువ ప్రజా వ్యతిరేకత!

ముఫ్పై శాతం కన్నా తక్కువ ప్రజాదరణతో అత్యధిక వ్యతిరేకత మూటగట్టుకున్న ఎమ్మెల్యేలు వైసీపీవారే ఎక్కువగా ఉన్నారు. ఆ పార్టీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా అంటే 77 మంది ప్రజలకు దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న 23 మందిలో ఐదుగురు ఇదేపరిస్థితి ఎదుర్కొంటున్నారు. జనసేన ఎమ్మెల్యే కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాు. అదే సమయంలో వ్యతిరేకతకు దగ్గరగా.. గట్టి పోటీ ఎదుర్కొంటున్న వారిలో 28 మంది వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఉండగా.. ఐదుగురు టీడీపీ వారున్నారు. పాత మంత్రుల్లో 11 మంది.. కొత్త మంత్రుల్లో 7గురుకి 30 శాతం కంటే తక్కువ ప్రజాదరణ ఉంది. గట్టి పోటీ ఎదుర్కొంటున్న వారిలో ఐదుగురు కొత్త మంత్రులు..ఓ తాజా మాజీమంత్రి ఉన్నారు.

జనసేన పాత్ర కీలకమే !

జనసేన పార్టీ రెండు శాతానికిపైగా ఓటు బ్యాంక్ పెంచుకోవడం కీలకంగామారింది. ఆ పార్టీ ఆరేడు అసెంబ్లీసీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. అదే సమయంలో 15కిపైగా అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి 17 శాతానికిపైగా ఓటు బ్యాంక్ ఉంది. ఈ నియోజకవర్గాలన్నీ ఒక్క గాజువాక మినహా అన్నీ ఉభయగోదావరి జిల్లాల్లోనివే.

ఎంపీ సీట్లలోనూ దాదాపుగా ఇదే పరిస్ధితి.

ఏపీలో ఉన్న 25 మంది ఎంపీల్లో 11 మంది 30 శాతం కన్నా తక్కువగా ప్రజల మద్దతు పొందుతున్నారు. వారిపై వ్యతిరేకత ఉంది. మరో నలుగురు ఎంపీలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, మచిలీపట్నం, ఏలూరు, అనంతపూర్, హిందూపురం, కర్నూలు ఎంపీలు ప్రజలకు దూరమయ్యారు. చిత్తూరు, అమలాపురం, విజయవాడ , అరకుల్లో గట్టి పోటీ కనిపిస్తోంది.

సర్వే శాంపిల్స్..ఇతర వివరాలు !

ఆత్మసాక్షి సర్వేలను పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తుంది. అన్ని రకాల పారామీటర్స్‌ను.. అన్ని వర్గాల ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. శాంపిల్ సైజ్‌ను కూడా భారీగా తీసుకుంటుంది. మొత్తం ఐదు విడతలుగా నిర్వహించిన సర్వేలో అక్షరాలా 3, 54, 000 మంది అంటే మూడున్నర లక్షల మందికిపైగా అభిప్రాయాన్ని తెలుసుకని.. విశ్లేషించి ఈ ఫలితం ఇచ్చారు.

ఆత్మసాక్షి గురించి !

ఆత్మ సాక్షి సర్వేలు ఇటీవలి కాలంలో ఖచ్చితత్వానికి దగ్గరగా ఉంటున్నాయి. పలు జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ సర్వేలను ప్రామాణికంగా తీసుకుని చెబుతున్నాయి. గత ఎన్ని వైఎస్ఆర్‌సీపీ ఎవరూ ఊహించనన్ని సీట్లు సాధిస్తుందని ఆత్మసాక్షి సర్వే అంచనా వేసింది. ఆ సర్వేకు తగ్గట్లుగానే ఫలితాలొచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అలాగే ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close