చంద్రబాబు కేసు సీబీఐ చేతికి?

ఓటుకు నోటు వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా బుక్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎం ఎ ఎ స్టీఫెన్ సన్ తో చంద్రబాబు మాట్లాడారని చెప్తున్న ఫోన్ సంభాషణ నిజమైందా కాదా అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ నిజమే అయినా, స్టింగ్ ఆపరేషన్ డేటాను కోర్టులు సాక్ష్యంగా స్వీకరించే అవకాశం లేదు.

ఒక్కసారి కాదు, అనేక సందర్బాల్లో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో స్టింగ్ ఆపరేషన్ ఫుటేజిని సాక్ష్యంగా పరిగణించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తెలంగాణ ఏసీబీ మాత్రం మొదట బాబుకు నోటీసు ఇవ్వాలని భావిస్తోంది. ఆ తర్వాత ఆయన్ని విచారించాలని యోచిస్తోంది.

ఒక రాష్ట్ర ఏసీబీ అధికారులు మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటరాగేట్ చేయడం ఆషామాషీ విషయం కాదు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబును విచారించాలంటే గవర్నర్ అనుమతి కావాలి. సరైన ఆధారాలు, అంటే ప్రైమాఫేసీ లేకుండా గవర్నర్ అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు.

స్టీఫెన్ సన్ తో చంద్రబాబు సంభాషణ నిజమే అయినా, అందులో ఎక్కడా లంచం ప్రస్తావన లేదు. అలాంటప్పుడు బాబు ఇంటారాగేషన్ కు గవర్నర్ అనుమతినివ్వరు అనేది ఏపీ ప్రభుత్వ నమ్మకం. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి కేసును సీబీఐకి అప్పగించాలని గవర్నర్ నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. ఏపీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, చివరకు ఈ వ్యవహారం సీబీఐ చేతికి వెళ్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుత తరుణంలో కేంద్రం వైఖరి కీలకం. బీజేపీకి  టీడీపీ మిత్రపక్షం. మోడీ ప్రభుత్వంతో చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయి. ఎన్నికల సమయంలో మోడీని సన్నాసి అని తిట్టిని కేసీఆర్ కు కేంద్రంతో సంబంధాలు అంతంత మాత్రమే. కాబట్టి, కేసు సీబీఐ చేతికి వెళ్తే కేసీఆర్ అనుకున్న ప్రకారం చంద్రబాబును ఇరుకున పెట్టడానికి లేదా అరెస్టు చేయడానికి అవకాశం ఉండక పోవచ్చు.

చంద్రబాబు లంచం ఎర చూపారనే ప్రాథమిక ఆధారం లేని కేసు నిలవదని ఏపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. పైగా, చంద్రబాబు ఫోన్ ను ట్యాప్ చేశామని కొందరు తెలంగాణ మంత్రులు అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాప్ చేయడం చట్ట వ్యతిరేకం. ఈ పాయింటు మీద తెలంగాణ ప్రభుత్వాన్ని బర్దరఫ్ చేయాలని టీడీపీ గట్టిగా డిమాండ్ చేయవచ్చు. అప్పుడు టీఆర్ఎస్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.

మోడీకి చంద్రబాబు మిత్రుడని తెలుసు కాబట్టి, ఈ కేసులో గట్టిగా పట్టుబడితే అసలుకే ఎసరు వస్తుందని కేసీఆర్ ప్రభుత్వం మిన్నకుండిపోక తప్పదనేది ఏపీ ప్రభుత్వ వర్గాల అంచనా. ఏ రకంగా చూసినా ఈ కేసు చివరకు సీబీఐ చేతికి వెళ్లే అవకాశాలే ఎక్కువని కొందరు న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close