జగన్ విజ్ఞానం : ప్రత్యేకహోదా వస్తే ఆదాయపు పన్ను కట్టక్కర్లేదు..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అంటారని ఆయనతో సన్నిహితంగా ఉండి బయటకు వచ్చిన వాళ్లు చెబుతూ ఉంటారు. కానీ బయట కూడా ఆయన అంతే ఉంటారని పదే పదే నిరూపిస్తూ ఉంటారు. ప్రత్యేకహోదా ఇవ్వడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతూ గతంలో వంద శాతం ఆదాయపు పన్ను మినహాయింపు వస్తుందని ప్రకటించారు. అప్పట్లోనే దీనిపై చాలా ట్రోలింగ్స్ వచ్చాయి. ప్రతిపక్ష నేతకు ఆ మాత్రం అవగాహన లేదా అని సాధారణ ప్రజలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి దీని గురించి తెలుసుకుని ఉంటారేమో అనుకున్నారు కానీ అలాంటిదేమీ లేదని స్వయంగా నిరూపించారు. అదీ కూడా.. జాతీయ మీడియా ముందు…రాజకీయప్రముఖుల ముందు.. తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు.

ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న జగన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రత్యేకహోదా ఎందుకంటే… ముందుగానే బట్టీ పట్టిన ప్లస్ పాయింట్లన్నీ చెప్పుకొచ్చారు. అందులో ఈ వంద శాతం ఆదాయపు పన్ను మినహాయింపు కూడా.. అలా దొర్లుకుంటూ వచ్చేసింది. జగన్ వాక్ప్రాహం, చాతుర్యం, తెలివి తేటలు చూసి అక్కడుతున్న వారు అలా చూస్తూండిపోయారు. ప్రత్యేకహోదా వస్తే ఆదాయపు పన్ను మినహాయింపు ఎలా వస్తుందా..అని ఆలోచించేంత సమయం కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి హోదా ప్రయోజనాలు చెప్పుకుంటూ పోయారు. ఆ జర్నలిస్ట్ కూడా… ఇంకా ఎక్కువ ప్రశ్నించడం ఎందుకనుకున్నారో కానీ ఉపప్రశ్నలు వేయకండా వదిలేశారు.

జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా వస్తే ఆదాయపు పన్ను ఉండదని చెప్పడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా లేక తనకు తెలిసిందే చెబుతున్నారా అన్నది చాలా మందికి అర్థం కావడం లేదు. తెలియకపోతే, కనీసం ఆయనకు స్పీచ్‌లు రాసిచ్చే జీఏడీ కృష్ణమోహన్ లాంటి మేధావులైనా చెబుతారు కదా అన్న సందేహం చాలా మందికి వస్తుంది. కానీ ఆయన వారి మాటలు వింటారో లేదో ఎవరికీ తెలియడం లేదు. ఇదొక్కటే కాదు, హెరిటెజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లు చంద్రబాబువేనని, ఆర్టీసీని నిర్వీర్యం చేసి కేశినేని నాని బస్సుల్ని చంద్రబాబు తిప్పడానికి పర్మిషన్ ఇచ్చారని ఇప్పుడు కూడా చెబుతూ ఉంటారు. నిజానికి హెరిటేజ్ ఫ్రెష్ అమ్మేసినప్పుడు అందులో అక్రమాలు జరిగాయని ఆరోపించింది కూడా జగనే. అయినా ఇప్పుడు రైతుల దగ్గర పాలను 30కి కొని వందకు హెరిటేజ్ ఫ్రెష్‌లో చంద్రబాబు అమ్ముతారని విమర్శలు చేస్తూనే ఉంటారు. కేశినేని బస్సులు ఇప్పుడు లేవని తెలిసి కూడా ఆరోపిస్తూనే ఉంటారు. ఆ కోణంలోనే ఈ ఆదాయపు పన్ను వ్యవహారం అని సర్దుకోవాల్సిందేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close