12 మందిలో ఆ ఒక్క‌రు… ఎవ‌రు??

సినీ తార‌లు – డ్ర‌గ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ విచారించిన వాళ్ల‌లో ఎవ‌రినీ అరెస్టు చేయొద్ద‌ని… కేవ‌లం వార్నింగ్ ఇచ్చి వ‌దిలేయ‌మ‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. డ్ర‌గ్స్ తీసుకొన్న వాళ్ల‌ని బాధితులుగా మాత్ర‌మే చూడాల‌ని, వాళ్ల‌పై కేసులు ఉండ‌వ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేసిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఆ మాట‌లు.. సిట్ విచార‌ణ ఎదుర్కొంటున్న 12 మందికీ ఎన‌లేని ధైర్యం ఇచ్చేశాయి. కాక‌పోతే… ఓ సినీ సెల‌బ్రెటీని మాత్రం సిట్ అధికారులు టార్గెట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. డ్ర‌గ్స్ వాడ‌డ‌మే కాదు, వాటిని స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు ఆ సెల‌బ్రెటీ చుట్టూ అనుమానాలు పెన‌వేసుకొన్నాయి. అందుకు సంబంధించి కీల‌క‌మైన ఆధారాలు సైతం సిట్ అధికారులు సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది. 12 మందిలో అరెస్టు గానీ, కేసుగానీ ఎదుర్కొనే అవ‌కాశం ఆ ఒక్క‌రికే ఉంద‌ని స‌మాచారం. ఆ ఒక్క‌రూ ఎవ‌రు అనేది ఇప్పుడు ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

మ‌రోవైపు ఒక‌రిద్ద‌రు సెల‌బ్రెటీలు సిట్‌కి కీల‌క స‌మాచారం అందించిన‌ట్టు తెలుస్తోంది. వాళ్లు అందించిన స‌మాచారం మేర‌కు.. మ‌రికొన్ని కొత్త పేర్లు వెలుగులోకి వ‌చ్చాయ‌ట‌. ఫ‌లానా వాళ్లు డ్ర‌గ్స్ తీసుకోవ‌డం మేం చూశాం.. అని చెప్ప‌డంతో సిట్ అధికారులు షాక్‌కి గుర‌య్యార‌ని తెలుస్తోంది. డ్ర‌గ్స్ కేసులో వీళ్ల‌ని సాక్ష్యులుగా మ‌ర్చింది సిట్‌. న‌వ‌దీప్ నుంచి సిట్ కీల‌క స‌మాచారం రాబ‌ట్టింద‌ని, న‌వ‌దీప్ విచార‌ణ త‌ర‌వాతే సిట్ రెండో జాబితావైపు దృష్టిసారించింద‌ని స‌మాచారం. మ‌రి న‌వ‌దీప్ ఎవ‌రి పేర్లు బ‌య‌ట‌పెట్టాడో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.