‘శ్రీశ్రీ’ సినిమాలో మహేష్

సూపర్ స్టార్ కృష్ణ తన నటనా ప్రతిభను మరోసారి ప్రేక్షకుల ముందు ఆవిష్కరించేందుకు వస్తున్నారు. 70 ఏళ్లు వచ్చినా సరే నటన మీద ఆయనకున్న ఇష్టం చూస్తుంటే హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. దశాబ్ద క్రితం వరకు సోలో హీరోగా కూడా అలరించిన కృష్ణ సినిమాలు తీయడం తగ్గించేశారు. 2013లో వచ్చిన సుకుమారుడు సినిమాలో కనిపించి అలరించిన కృష్ణ ఇప్పుడు తానే లీడ్ రోల్ చేస్తూ ఓ సినిమా చేస్తున్నారు.

అభ్యుదయ భావానానికి ఆనవాలుగా, నవ యువ చైతన్యానికి నాంధి పలికిన శ్రీ రంగం శ్రీనివాస్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘శ్రీశ్రీ’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో మంచి సినిమాలకు తెలుగు ప్రేక్షకులకు అందించిన ముప్పలనేని శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. కృష్ణ, విజయ నిర్మల కలిసి నటిస్తున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ కూడా అతిథి పాత్రలో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

దక్షిణ భారత సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రిన్స్ మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ‘శ్రీశ్రీ’ మహా ప్రస్థానంగా వస్తున్న ఇలాంటి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ అతిథి పాత్రకు కి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. సూపర్ స్టార్ కృష్ణ కూడా ఓ మాట చెప్పాడట. శ్రీశ్రీ సినిమాలో మహేష్ నటించడం నిజమే అయితే ఆ సినిమా ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందనడంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close