అందుకే విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడం లేదుట!

కొన్నినిర్ణయాలకి ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వాలు భావించినప్పుడు, దానిపై ప్రజా స్పందన ఏవిధంగా ఉంటుందో తెలుసుకొనేందుకు ముందుగా చూచాయగా వాటి గురించిమీడియాకి లీకులు ఇచ్చి పరీక్షించుకొంటాయి. ఉదాహరణకి విశాఖలో ఏర్పాటు చేయవలసిన రైల్వేజోన్ని విజయవాడకి తరలించబోతున్నట్లు వచ్చిన వార్త కూడా అటువంటిదే.

విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి ఓడిశా ప్రభుత్వం అభ్యంతరం చెపుతున్నందునే విజయవాడలో ఏర్పాటు చేద్దామని కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై తెదేపా నేతల, మంత్రుల మౌనం కూడా వ్యూహాత్మకమే. కానీ రైల్వేజోన్ విజయవాడకి తరలించుకుపోతున్నట్లు వార్తలు రాగానే విశాఖలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు చేపట్టడంతో, ముఖ్యమంత్రి కూడా ఆ ప్రతిపాదనని గట్టిగా వ్యతిరేకిస్తునారంటూ మీడియాలో వార్తలు (లీకులు) వచ్చాయి. అది ప్రజాగ్రహం నుంచి తప్పించుకోనేందుకేనని చెప్పవచ్చు.

దానిపై రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రకటన చేస్తారని చెప్పి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పించుకొన్నారు. ఇప్పటికి జైట్లీ ప్రత్యేక ప్రకటన చేసి వారం రోజులు అవుతోంది కానీ ఇంతవరకు సురేష్ ప్రభు రైల్వేజోన్ ఏర్పాటు గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. బహుశః ఇప్పుడప్పుడే చేయరేమో కూడా.

తాజా సమాచారం ప్రకారం ఓడిశా ప్రభుత్వం రైల్వేజోన్ కి పోలవరానికి ముడిపెట్టినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకి తాము అడ్డుపడకూడదనుకొంటే, విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్లు సమాచారం. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేసినట్లయితే భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే చాలా బారీగా ఆదాయం కోల్పోతుంది. అందుకే ఓడిశా మొదటి నుంచి విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుని అడ్డుకొంటూనే ఉంది. దానిని పోలవరంతో ముడిపెట్టడం ద్వారా రైల్వేజోన్ని అడ్డుకోగలిగింది.
ఈవిషయం తెదేపాలో అందరికీ తెలిసినా బయటకి చెపితే ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందనే భయంతోనే చెప్పడంలేదని అనుకోవలసి ఉంటుంది. లేకుంటే విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు గురించి ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే అధికార పార్టీ నేతలు, మంత్రులు మాట్లాడకుండా ఈవిధంగా మౌనం వహించి ఉండేవారు కాదు.

ప్రత్యేక హోదా విషయంలో కూడా తెదేపా ఈవిధంగానే ప్రజలతో దాగుడుమూతలు ఆడి చివరికి ప్రత్యేక ప్యాకేజి తీసుకొంది. రైల్వేజోన్ విషయంలో కూడా ఇప్పుడు అలాగే వ్యవహరిస్తోంది. ఈవిధంగా ప్రజలని మభ్యపెట్టి ఇప్పటికి సమస్య నుంచి బయటపడవచ్చునేమో కానీ వచ్చే ఎన్నికలలో అది సాధ్యం కాదని గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close