ఆయనా అవినీతి గురించి మాట్లాడేది?

కొందరు రాజకీయ నేతలు కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటే వెంటనే అదే అంశానికి సంబంధించిన వారి భాగోతాలు గుర్తుకువస్తుంటాయి. మాజీ కాంగ్రెస్ ఎంపి కావూరి సాంభశివరావు అవినీతి గురించి మాట్లాడితే ఎవరికైనా ఆయన బ్యాంకులకి ఎగవేసిన రూ.1000 కోట్లు అప్పు గురించి, దానిని వసూలు చేసుకోలేక హైదరాబాద్ లో ఆయన ఆఫీస్ ముందు బ్యాంకుల ప్రతినిధులు నోటికి నల్లగుడ్డలు కట్టుకొని మౌన ప్రదర్శన చేయడం గుర్తుకురాక మానదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు సోనియా, రాహుల్ గాంధీలకి భజన చేసిన ఆయన రాష్ట్ర విభజన కారణంగా ఓడిపోబోతోంది అని పసిగట్టగానే తెదేపాలోకి దూకేయాలని ప్రయత్నించి అది సాధ్యం కాకపోవడంతో భాజపాలోకి దూకేశారు.

అటువంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. ప్రత్యేక ప్యాకేజి కారణంగా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొంటున్న భాజపాని కాపాడేందుకు ఆ పార్టీ నేతలు అందరూ రంగంలోకి దిగుతున్నారు. వారితో బాటు రంగంలోకి దిగిన కావూరి సాంభశివరావు మీడియాతో మాట్లాడుతూ, “నరేంద్ర మోడీ అధిఅకరం చేపట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వంలో అవినీతి చాలా వరకు తగ్గిపోయింది. రెండున్నరేళ్ళ మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాకపోవడం గమనిస్తే ఆయన పాలన ఎంత స్వచ్చంగా సాగుతోందో అర్ధం చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాలలో కూడా అటువంటి అవినీతిరహితమైన పాలన సాగాలని మేము కోరుకొంటున్నాము. అందుకు కృషి చేస్తున్నాము,” అని అన్నారు.

ఈ మాటలు విన్నప్పుడు అందరూ ఏమనుకొంటారో వేరేగా చెప్పనవసరం లేదు. మోడీ ప్రభుత్వ పాలనలో అవినీతి తగ్గిన మాట వాస్తవమే. రాష్ట్ర స్థాయిలో కూడా అవినీతిని అరికట్టవలసిన అవసరం ఉంది. కానీ ముందుగా ఆ బ్యాంకుల దగ్గర తీసుకొన్న డబ్బుని కావూరి తిరిగి చెల్లించారో లేదో? చెల్లించకపోయుంటే ముందు దానిని చెల్లించేసి ఈ మాటలు చెపితే బాగుంటుంది కదా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close