ఆర్కే పలుకు : స్కిల్ కేసు కుట్ర అని కేంద్రానికి గవర్నర్ రిపోర్ట్ ?

చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపారని ఏపీ గవర్నర్ .. కేంద్రానికి నివేదిక ఇచ్చారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన కొత్తపలుకులో వివరించారు. అయితే గవర్నర్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తిగా చెప్పారు. అదే సమయంలో పరాయి రాష్ట్రానికి చెందిన వారు అన్నారు. ఏపీలో అలాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న పరాయి రాష్ట్ర వ్యక్తి.. అంతకు మించి కేంద్రానికి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత ఉండేది కూడా గవర్నరే. అందుకే గవర్నరే ఈ రిపోర్టు ఇచ్చారని ఆర్కే చెప్పారని అనుకోవచ్చు. అసలు స్కిల్ కేసులో కనీస ఆధారాలు కూడా లేవని.. ఏపీలో ఘోరమైన పరిపాలనా పరిస్థితులు ఉన్నాయని గవర్నర్ నివేదిక ఇచ్చినట్లుగా ఆర్కే చెబుతున్నారు.

నిజానికి తన కొత్తపలుకులో ఈ విషయం చెప్పడానికి స్పేస్ లేదు. తనకు తెలిసిన విషయాన్ని.. అదీ కూడా బ్లాస్టింగ్ న్యూస్ లాంటిది కాబట్టి చెప్పాలనుకుని స్పేస్ క్రియేట్ చేసుకున్నారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అంటూ.. జగన్ రెడ్డి విపక్షాలను విమర్శిస్తారని చెబుతూ.. ఇలా రిపోర్టు ఇచ్చినందుకు ఆయనను కూడా విమర్శిస్తారని చెప్పకొచ్చారు. అయితే ఇక్కడ కొత్త పలుకులో ఆయన చెప్పిన విషయాలకు… గవర్నర్ రిపోర్టుకు సంబంధం లేకపోయినా.. విషయం ఇంట్రస్టింగ్ కాబట్టి.. దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది. ఇక పలుకుల్లో సహజంగానే జగన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. పైగా తన సంస్థకు చెందిన ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. ఆయన తన మార్క్ చూపించారు. చాలెంజ్ లు చేశారు.

ఇక తెలంగాణ విషయంలోనూ భిన్నమైన పలుకులు ఉన్నాయి. బీఆర్ఎస్ పనైపోయిందని ఇంత కాలం రాసుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఆ పార్టీని కాపాడుకోవాల్సిందేనని కాంగ్రెస్‌కు సలహా ఇస్తున్నారు. బీఆర్ఎస్ విషయంలో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఆలోచించాలని ఆ పార్టీకి అండగా ఉండాలని ఆయన చెబుతున్నారు. అంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నికల్లో ఒకటి రెండు స్థానాలకే పరిమితమైతే.. ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పై పడుతుంది. ఎలా అంటే… బీఆర్ఎస్ నిర్వీర్యం అయిపోతుంది. ఆ పార్టీకి చెందిన వారు బీజేపీలో చేరుతారు. ఫలితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సీన్ మారిపోతుంది. అదే జరిగితే.. కాంగ్రెస్ .. రేవంత్ రెడ్డి తట్టుకోలేరనేది రాధాకృష్ణ సలహా.

బీఆర్ఎస్ పొత్తులకు బీజేపీ సిద్ధం గా లేదని తేల్చిన ఆయన.. ఏపీలో పొత్తుల విషయంలో ఏమీ తేల్చడం లేదని అంటున్నారు. అంటే.. ఈ అంశంపై ఆయనకు అసలు ఇన్ సైడ్ సమాచారమే తెలియడం లేదన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close