అల్ల‌రోడికి మేడ‌మీద ఏం ప‌ని?

అల్ల‌రి న‌రేష్ సినిమా టైటిళ్ల‌న్నీ కాస్త విచిత్రంగా.. ఇంకాస్త ఫ‌న్నీగా ఉంటాయి. టైటిల్‌తోనే స‌గం న‌వ్విస్తుంటాడు న‌రేష్‌. అయితే ఈమ‌ధ్య ఆ న‌వ్వుల హంగామా కాస్త‌త‌గ్గింది. ఇది వ‌ర‌క‌టిలా.. పూర్తి స్థాయిలో న‌వ్వించే క‌థ‌ల కోసం న‌రేష్ విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. తాజాగా కృష్ణ‌భ‌గ‌వాన్ న‌రేష్ కోసం ఓ క‌థ అందించాడు. అలా ఎలా తో ఆక‌ట్టుకొన్న‌ అనీష్ కృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. సెప్టెంబ‌రులో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స్తుతం టైటిల్ కోసం వేట సాగిస్తున్నారు. ఈ చిత్రానికి మేడ‌మీద అబ్బాయి అనే టైటిల్ అనుకొంటున్నారు. న‌రేష్ టైటిళ్ల‌న్నీ హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూనే తిరుగుతాయి కాబ‌ట్టి.. ఈ టైటిల్ కూడా న‌రేష్‌కి బాగా సూట‌వుతుంద‌ని చిత్ర‌బృందం న‌మ్మ‌కం. అతి త్వ‌ర‌లో ఈ టైటిల్‌పై ఓ నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం అల్ల‌రి న‌రేష్‌.. సెల్ఫీ రాజా సినిమా ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నెల‌లోనే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

రౌడీ బ‌ర్త్ డేకి.. బోలెడ‌న్ని స‌ర్‌ప్రైజ్‌లు

ఈనెల 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రౌడీ కొత్త సినిమా సంగ‌తులన్నీ ఒకేసారి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాయి. విజ‌య్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close