న‌రేష్ ఇంట్లో దెయ్యం ఉంది

హార‌ర్ కామెడీ చిత్రాల ట్రెండ్ న‌డుస్తోంది. అలాంటి సినిమాలు పెద్ద‌గా ఆడ‌క‌పోయినా.. ఆ త‌ర‌హా క‌థ‌ల‌పై మోజు మాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా అల్ల‌రి న‌రేష్ కూడా ఓ హారర్ కామెడీ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ చిత్రానికి జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కోసం ఓ వెరైటీ టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు టాలీవుడ్ స‌మాచారం. అదే.. ”మా ఇంట్లో దెయ్యం.. నాకెం భ‌య్యం”. ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. స్ర్కిప్టు వ‌ర్కు పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తారు.

గ‌త కొంత‌కాలంగా న‌రేష్‌కి స‌రైన విజ‌యాలు ద‌క్క‌డం లేదు. సుడిగాడుకి ముందు ఓ అర‌డ‌జ‌ను సినిమాలు ప‌ల్టీ కొట్టాయి. ఆ త‌ర‌వాత‌.. వ‌రుస‌గా ప‌రాజ‌య ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అందుకే త‌న‌కు హిట్లిచ్చిన నాగేశ్వ‌ర‌రెడ్డితో జ‌త క‌ట్టాడు. ఈ సినిమాకి భారీ నిర్మాత కూడా తోడ‌య్యాడు. అందుకే.. ఈ హార‌ర్ కామెడీపై ఆశ‌లు పెట్టుకొన్నాడు అల్ల‌రోడు. మ‌రి ఈ దెయ్య‌మైనా న‌రేష్‌ని క‌నిక‌రిస్తుందో లేదో ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com