నీటి బుడగలా అమరావతి రియల్ ఎస్టేట్..! జగన్ వైపే అందరి చూపు..!

నవ్యాంధ్ర రాజధాని అమరావతి బిక్కు బిక్కుమంటోంది. భవిష్యత్‌లో… దేశం మొత్తం తిరిగి చూసే రాజధాని అవుతుందన్న ఉద్దేశంతో.. పెట్టుబడులు పెట్టినవారు… పెట్టాలనుకున్న వారు.. పెట్టాలని ప్రయత్నించి మధ్యలో.. ఉన్నవారు… అందరి చూపు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంపై వైపు చూస్తోంది. ప్రభుత్వం మారదన్న గట్టి నమ్మకంతో ముందడుగు వేసిన వారు ఇప్పుడు తమ పెట్టుబడి వెనక్కి వస్తే చాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు… అమరావతి రియల్ ఎస్టేట్ సంధికాలంలో ఉంది. అందరూ.. .ముఖ్యమంత్రి జగన్ వైపు చూస్తున్నారు.

అమరావతిపై జగన్ వైఖరి ఏమిటి..?

అమరావతి విషయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. ఓ స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఆ అభిప్రాయం ఏమిటో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఆయన రాజధాని అభివృద్ధి గురించి కానీ.. నిర్మాణం గురించి కానీ.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ అంతే… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా అంతే. అప్పుడెప్పుడో.. అమరావతిని మార్చబోమని.. కావాలంటే మేనిఫెస్టోలో కూడా పెడతామని.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. కానీ మేనిఫెస్టోలో మాత్రం లేదు. అంటే.. ఆ ప్రకటనకు జగన్ అప్రూవల్ లేదనే అర్థం. అప్పటికీ.. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి.. అమరావతిలో అక్రమాలు జరిగాయనే వాదన వినిపిస్తున్నారు కానీ… కొత్త రాజధానిని.. నిర్మిస్తామని.. మాత్రం చెప్పడం లేదు.

పడిపోయిన రేట్లు – రిజిస్ట్రేషన్ల ఆదాయం..!

రాజధాని విషయంలో ఎన్నికలకు ముందు నుంచి అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో… పెట్టుబడిదారులు.. మధ్యలోనే ఆగిపోయారు. ఫలితంగా.. గత నాలుగు నెలల కాలంలో.. ఏపీలో రిజిస్ట్రేషన్ల ఆదాయం.. రూ. 300 కోట్ల వరకూ తగ్గిపోయింది. ప్రధానంగా.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చాలా పరిమితంగా జరుగుతున్నాయి. భూములు, ఫ్లాట్ల ధరలు ఇరవై నుంచి నలభై శాతం తగ్గిపోయాయి. అయినప్పటికీ.. కొనుగోలు దారులు ఆసక్తి చూపడం లేదు. రాజధాని విషయంలో ప్రభుత్వ వైఖరి ఏమిటో తేలిన తర్వాత ముందడుగు వేయాలన్న అభిప్రాయంలో.. అటు రియల్టర్లు.. ఇటు కొనుగోలుదారులు ఉన్నారు. అందరిలోనూ వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. హ్యాపీ నెస్ట్ పేరుతో.. సీఆర్డీఏ.. రెండు అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులను అమ్మకానికి పెట్టింది. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు.. నిర్మాణం కొనసాగినన్నాళ్లూ మార్కెట్ చేసుకుంటూ ఉంటాయి. కానీ హ్యాపీ నెస్ట్ మాత్రం గంటల్లో బుకింగ్ అయిపోయాయి. ఇప్పుడు… వాళ్లు కూడా.. తాము వెనక్కి తగ్గుతామని ఫోన్లు చేస్తున్నారు. కానీ సమాధానం చెప్పడానికి సీఆర్డీఏ అధికారులకే ఏమీ తెలియడం లేదు.

వేలకోట్ల పెట్టుబడులు ఇరుక్కుపోతాయా..?

అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత గుంటూరు.. విజయవాడ మధ్య భారీ భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఇక గుంటూరు నుండి అమరావతి రోడ్డుతో పాటు. . రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వందల వెంచర్లు వేశారు. వాటితో పాటు.. విజయవాడ కు పది కిలోమీటర్ల దూరంలో.. అటు గుంటూరు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరం వరకూ.. రియల్ ఎస్టేట్ వెంచర్లు పడ్డాయి. లావాదేవీలు చురుగ్గా సాగాయి. ఆయా వెంచర్లు.. అపార్టుమెంట్లు.. గృహాలపై.. వేల కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇవన్నీ… కేవలం ఒక్క అమరావతి బ్రాండ్‌ను చూసి మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అమరావతి నిర్మాణం ఆగిపోతుందని.. అనిపించినా… ఒకటి, రెండు భవనాలతో సరిపెడతారని తెలిసినా… రియల్ ఎస్టేట్ భారీ నష్టాలకు కారణమయ్యే అవకాశం ఉంది.

విచారణ పేరుతో హడావుడి చేస్తే పెట్టుబడులమాటే ఉండదు..!

అమరావతిలో అక్రమాలు జరిగాయో లేదో.. ఎవరికీ తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి… ముందు నుంచీ.. అక్రమాలు జరిగాయని చెబుతున్నారు. తాము వస్తే సీబీఐ విచారణ జరిపిస్తామని చెబుతున్నారు. అదే జరిగితే.. అక్రమాలు .. జరిగినా… జరగకపోయినా… పెట్టుబడి దారులు మాత్రం.. ఈ కష్టం మాకెందుకు.. అని అనుకోవడం ఖాయం. ఏ ఒక్కరూ లావాదేవీలు జరపడానికి ముందుకు రారు. చివరికి.. అమరావతిలో ఏమీ జరగలేదని.. సీబీఐ తేల్చినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తర్వాత ఎవరైనా పెట్టుబడిదారులను ఆహ్వానించినా… వారు వచ్చే అవకాశం ఉండదు.

సీఆర్డీఏపై.. ఆరో తేదీన జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేస్తామన్నారు. కానీ ఆ రోజు రంజాన్ కావడంతో.. చేయలేదు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు చేస్తారో చెప్పలేదు. సమీక్ష త్వరగా నిర్వహించి… అమరావతిపై.. ప్రభుత్వ విధాన్ని జగన్ స్పష్టం చేస్తే తప్ప.. ఏపీ రియల్ ఎస్టేట్‌లో కదలిక వచ్చే అవకాశం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...
video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close