పేర్లు లేకుండా ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులిస్తున్న ప్రభుత్వం..!

ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తున్న కథనాలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. మీడియాపై కేసులు పెట్టేందుకు తెస్తున్న జీవో ఆధారంగా ఆ కథనాలన్నింటిపై లీగల్ నోటీసులు పంపుతున్నారు. కానీ అప్పుడప్పుడు.. ఎవరి పేరుతో పంపాలో కూడా అర్థం కావడం లేదు. అందుకే.. ఓ వ్యవస్థ పేరు పెట్టేసి లీగల్ నోటీసులు పంపేస్తూ.. మరీ ఇంత అనాలోచితంగా.. ప్రభుత్వ న్యాయయంత్రాంగం పని చేస్తుందా అనిపించేలా.. చేస్తున్నారు. గతంలో.. హైకోర్టు న్యాయమూర్తులపై నిఘా పెట్టారనే కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దానిపై ఆంధ్రజ్యోతి పత్రికకు లీగల్ నోటీసులు పంపింది. ఇప్పుడు తాజాగా.. ఇద్దరు కలెక్టర్లు.. స్త్రీ లోలురు అనే అర్థం వచ్చేలా హనీ ట్రాప్ అనే కథనాన్ని ఆంధ్రజ్యోతి వేసింది. దీనిపై ప్రభుత్వానికి కోపం వచ్చింది. వెంటనే లీగల్ నోటీసును పంపేశారు.

పై నుంచి ఆదేశాలొచ్చాయి కాబట్టి.. ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు పంపేశారు. కానీ.. ఎవరి పేరు మీద పంపాలో.. ఆ పంపిన పీపీకి అర్థమవలేదు. ఎవరో ఇద్దరు కలెక్టర్ల పేర్లు చెబితే.. ఆ కథనంలో ఉన్నది వారేనని అనుకుంటారు. అలాగని పేర్లు లేకుండా నోటీసులు ఇవ్వలేదు. అందుకే.. కలెక్టర్లు అంతా అన్నట్లుగా ఓ లీగల్ నోటీసులు సర్వ్ చేసేశారు. ఐఏఎస్ అయినప్పటి నుంచి అందరూ.. కలెక్టర్లే కారు.. కలెక్టర్లుగానే ఉండిపోరు. అయినప్పటికీ.. ఎవరి పేరు చూపించకుండా.. కలెక్టర్ల పేరుతో .. కలెక్టర్ల గొప్పదనం చెబుతూ.. ఓ వ్యాసం రాసి మరీ నోటీసు ఇచ్చేశారు.

వాస్తవానికి కలెక్టర్లు అయినంత మాత్రాన అందరూ సుద్దపూసలు కారు. అందరూ చెడ్డవాళ్లు కాదు. సమాజంలో మంచీ చెడూ ఎలా భాగమో.. అన్ని వ్యవస్థల్లోనూ అంతే. ఆంధ్రజ్యోతి.. అలా కలెక్టర్ల వ్యవస్థలో ఇలా ఇద్దరున్నారని.. తనకు తెలిసిన సమాచారం రాసింది. ప్రత్యేకంగా పేరు పెట్టి రాయలేదు. దానికే ఉలిక్కిపడిపోయింది ప్రభుత్వం. నోటీసులు పంపేసింది. ఇలాంటి నోటీసులు చెల్లవని.. ప్రత్యేకంగా ఎవరికైనా పరువు నష్టం జరిగితే.. వారే నోటీసు ఇస్తే చెల్లుతుందని న్యాయవాదులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close