బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేతిలో ఉన్న సినిమాల్లో `టైసన్ నాయుడు` ఒకటి. సాగర్ చంద్ర దర్శకుడు. రామ్ ఆచంట నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. పూర్తయిపోయింది కూడా. ‘టైసన్ నాయుడు’ తరవాత మొదలైన సినిమాలు కూడా విడుదలైపోయాయి. కానీ `టైసన్` మాత్రం తాబేలు పిల్లలా మెల్లగా నడుస్తోంది. మధ్యలో కొన్ని రీ షూట్లు జరిగాయని, అందుకే విడుదల ఆలస్యమైందని వార్తలు వినిపించాయి. ఈమధ్య ఈ సినిమాని కొంతమంది సన్నిహితులకు చూపించారని, అవుట్ పుట్ బాగా వచ్చిందని సమాచారం. అవుట్ పుట్ పై చిత్రబృందం సంతృప్తిగా ఉందని, త్వరిత గతిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, విడుదల తేదీ ప్రకటించాలని భావిస్తున్నారు.
ఇప్పుడు ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ చేసుకొంది. జియో హాట్ స్టార్ సంస్థ ఈ సినిమాని రూ.20 కోట్లకు కొనేసిందని టాక్. హిందీ డీల్ కూడా క్లోజ్ అయ్యాక.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. మరోవైపు ‘హైందవ’ అనే సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. లుధీర్ బై రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. ఈనెల 5న బెల్లంకొండ నిశ్చితార్థం జరగబోతోంది. నెలాఖరున పెళ్లి. అందుకే షూటింగులకు కూడా బెల్లంకొండ బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
