‘ఆంధ్రా కింగ్ తాలుకా’ తరవాత రామ్ పోతినేని సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. మధ్యలో దర్శకులుగా కొందరి పేర్లు వినిపించాయి. ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుందని ఆశించారు. రామ్ సోదరుడే ఈ చిత్రానికి నిర్మాత అన్నారు. లోకేష్ కనగరాజ్ శిష్యుడు విఘ్నేష్ – రామ్ మధ్య చర్చలు నడిచాయి. దాదాపుగా ప్రాజెక్ట్ ఖాయం అనిపించింది. కానీ.. విఘ్నేష్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నారని సమాచారం. ఆ ప్లేస్ లో మరొకర్ని ఎంచుకోవాల్సివుంది.
‘ఆంధ్రాకింగ్ తాలుకా’ సినిమా కోసం రామ్ ఓ పాట పాడారు. ఓ పాట రాశారు కూడా. ఇప్పుడు ఏకంగా ఓ కథే రాసుకొన్నారు. ఆ కథని డైరెక్ట్ చేయాలి అంతే. అందుకే రామ్ అన్వేషణ. మే 15న రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా దర్శకుడ్ని సెట్ చేయాలి. ఆర్కా మీడియా సంస్థ కూడా రామ్ తో ఓ సినిమా చేయాలని ప్రయత్నిస్తోంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు సాగుతున్నాయి. కొంతమంది దర్శకులు కూడా రామ్ కి కథలు చెప్పారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతుందో?
