టీఆర్ఎస్ మెతకదనమే బీజేపీకి అలుసైందా..!?

భారతీయ జనతా పార్టీ విషయంలో టీఆర్ఎస్ అనుసరిస్తున్న మెతక వైఖరితో ఆ పార్టీ అలుసైపోయిందన్న విషయం వరంగల్‌లో మరోసారి బయటపడింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ కార్యకర్తలు నిర్భయంగా వచ్చి దాడులు చేసేశారు. అయోధ్య రామాలయం కోసం భారతీయ జనతా పార్టీ నేతలు వసూలు చేస్తున్న విరాళాలపై లెక్కలు చెప్పాలంటూ… పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. హన్మకొండలోని ఆయన ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడులకు దిగారు. పెద్ద ఎత్తున ధర్మారెడ్డి ఇంటికి రాళ్లు, కోడి గుడ్లతో వచ్చిన కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకుంటున్నా రాళ్లు, కోడి గుడ్లు విసిరారు. రాళ్ల దాడిలో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇంటి ఆవరణలో కుర్చీలను కూడా బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఓ పోలీసు అధికారికి గాయాలయ్యాయి. కాసేపటికి పెద్ద ఎత్తున పోలీసులు ధర్మారెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. దాడులు చేసిన వారందర్నీ అరెస్ట్ చేశారు. యాభై మందికిపైగా దాడి ఘటనలో పాల్గొన్నారని వారిపై కేసులు నమోదు చేశామని పోలీసులు ప్రకటించారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడి ఘటన తెలంగాణలో కలకలం రేపింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెంటనే స్పందించారు. భౌతిక దాడులు చేయాలని టీఆర్ఎస్ అనుకుంటే.. బీజేపీ నేతలు తట్టుకోలేరని హెచ్చరించారు. ధర్మారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. వరంగల్‌కు చెందిన కీలక టీఆర్ఎస్ నేతలంతా ధర్మారెడ్డిని పలకరించడానికి వచ్చారు. బీజేపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతి దాడులు చేయాలనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. కానీ వారు బయటకు ఆ మాట చెప్పారు కానీ… బీజేపీ నేతల ఇళ్లపై దాడులు చేయడానికి అంగీకారం తెలిపినట్లుగా ఉన్నారు. అందుకే రాత్రంగా వరంగల్ జిల్లాలో బీజేపీ నేతల ఇళ్లపై దాడుల పరంపర సాగింది. కొంత మది ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు.

అయోధ్య విరాళాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి వ్యతిరేకత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నా… బీజేపీ నేతలు ఓవర్‌గా స్పందిస్తున్నారు. వారు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పా.. ఒప్పా అన్నది పట్టించుకోవడంలేదు. ముందు తప్పుగా చిత్రీకరించేసి కొట్టడానికి వెళ్తున్నారు. గతంలో కోరుట్లఎమ్మెల్యే విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు ధర్మారెడ్డి విషయంలోనూ అదే జరిగింది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి.. చట్ట విరుద్ధమైతే న్యాయపరమైనచర్యలు తీసుకోవాలని కానీ చట్టాన్నిచేతుల్లోకి తీసుకుని ఇళ్లపై దాడికి పాల్పడటం దుందుడుకు చర్యే. ఇలాంటివి రాజకీయాలను దారి తప్పేలా చేస్తున్నాయి. దాడుల వరకూ వెళ్లిపోతున్నాయి.

తెలంగాణలో పాగా వేయడానికి బీజేపీ ఇలా దూకుడు మార్గాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న తరుణంలో వీరి దూకుడు మరీ ఎక్కువగా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. దాడులు చేయాలనుకుంటే… వారికి పెద్ద విషయం కాదు. అధికార పార్టీపైనే దాడులు చేయడం అంటే చిన్న విషయంకాదు. తమ మెతక వైఖరితోనే బీజేపీ నేతలు దాడుల వరకూ వెళ్లిపోయారని టీఆర్ఎస్ నేతల్లో అసహనం కనిపిస్తోంది. బీజేపీకి లొంగిపోయామని వారు గట్టిగా నమ్ముతూండటంతోనే ఈ పరిస్థితి వస్తుందంటున్నారు. అందుకే రాత్రికి రాత్రి ప్రతి దాడులు చేశారు. కానీ అది సమస‌్యను పరిష్కరిస్తుందా అని… ఇతర నేతలు మథనపడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close