ఇక బీఎల్ సంతోష్ నిందితుడు కూడా కానట్లే !

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీఎల్ సంతోష్ ను నిందితుడిగా చేయాలని సిట్ చేసిన ప్రయత్నం విఫలమయింది. జగ్గు స్వామి, తుషార్ చెల్లపల్లి, శ్రీనివాస్ లను నిందితులుగా చేరుస్తూ సిట్ గతంలో ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. మొదట కేసు నమోదు చేసినప్పుడు వీరి పేర్లు లేవు. నందకుమార్, రామచంద్రభారతి, సింహయాజిల పేర్లు మాత్రమే ఉన్నాయి. తర్వాత కేసులో బీఎల్ సంతోష్, జగ్గూ స్వామి, తుషార్ అనే వారి కుట్ర ఉందని చెప్పి నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఐఆర్ లో పేర్లు లేకుండా సీఆర్పీసీ 41నోటీసులు జారీ చేస్తున్నారని వారు కోర్టులో పిటిషన్లు వేశారు.

దీంతో సివీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ పోలీసులు వారినీ నిందితులుగా చేరుస్తూ… ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. యితే అసలు ఈ కేసును సిట్ దర్యాప్తు చేయడం ఏమిటని.. చెల్లదని చెప్పి ఏసీబీ కోర్టు మెమోను తిరస్కరించింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేశారు. వీరి పిటిషన్ ను కొట్టి వేసిన కోర్టు .. ఏసీబి కోర్టు తీర్పు ను సమర్దించింది. దీంతో వారు నిందితులు కాదని స్పష్టమైంది. ఇప్పటికే ఈ కేసు సీబీఐకి వెళ్లింది. సిట్ ను రద్దు చేసింది. ఇప్పుడు సీబీఐ కొత్తగా నమోదు చేసిన కేసులోనూ బీఎల్ సంతోష్ పేరు ఉండే అవకాశం లేదు.

బీజేపీలో చేరితే వంద కోట్లు ఇస్తానని.. నందకుమార్ ప్రలోభపెట్టారని.. నంద కుమార్ వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకే ప్రస్తుతం కేసు నడుస్తోంది. అందుకే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. అయితే అసలు ఫామ్ హౌస్ కేసులో డబ్బుల చెలామణినే లేదని రోహిత్ రెడ్డి చెబుతున్నారు. అలాంటప్పుడు ఈడీ రాకూడదంటున్నారు. కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టులో ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు. దీంతో ఈడీ విచారణ కొనసాగనుంది. దీంతో అటు సీబీఐ.. ఇటు ఈడీ విచారణ తీరు మారిపోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైతన్య : టాలీవుడ్ పౌరుషం ఇంతేనా ?

సినీ పరిశ్రమ ఏపీలో లేదు. కానీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎంతగా వేధించిందో చూస్తే టాలీవుడ్ లో భాగం అనుకునే ఎవరికైనా పళ్లు పటపట కొరకాలని అనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి దేశ రెండో...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్…కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..?

పోలింగ్ కు ముందే బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని , తమతో టచ్ లోనున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందన్న చర్చ హాట్ టాపిక్ అవుతోంది. చేరికలకు సంబంధించి రాష్ట్ర...

కంచుకోటల్లోనే జగన్ ప్రచారం – ఇంత భయమా ?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో...

ఎలక్షన్ ట్రెండ్ సెట్ చేసేసిన ఏపీ ఉద్యోగులు !

ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close