డిస్మిస్ చేసిన కానిస్టేబుల్ ఫిర్యాదుతో అనంత ఎస్పీపై కేసు !

పోలీసులు తప్పుడు కేసు పెట్టి డిస్మిస్ చేసిన కానిస్టేబుల్ భాను ప్రకాష్ ఫిర్యాదు చేయడంతో అనంతపురం ఎస్పీతో పాటు మరో ముగ్గురు పోలీసు అధికారులపై కేసు నమోదు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానానికి వెళ్తానని భానుప్రకాష్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు కేసులు నమోదు చేయాలని నిర్ణయించడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారికి క్లీన్ చిట్ ఇప్పించడానికి ఇలా వ్యూహాత్మకంగా కేసులు నమోదు చేయించారన్న వాదన వినిపిస్తోంది. వేగంగా విచారణ జరిపి.. ఆ ఆరోపణలన్నీ తప్పని.. భానుప్రకాష్‌ తప్పుడు ఆరోపణలు చేశారనే నివేదికను విడుదల చేస్తారని.. అలా చేసినందుకు భానుప్రకాష్‌పై కేసులు పెట్టొచ్చని కూడా భావిస్తున్నారు.

భానుప్రకాష్ రెండు రోజుల కిందట తన ఫిర్యాదులో అనంతంపురం ఎస్పీ ఫక్కీరప్పపై తీవ్ర ఆరోపణలు చేశారు. బళ్లారిలో ఆయన మూడుకోట్లు పెట్టి ఇల్లు కడుతున్నారని.. అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలన్నీ సంచలనం సృష్టించాయి. ఆయన కడుతున్న ఇళ్లు ఫోటోలు కూడా వైరల్‌ అయ్యాయి. అయితే ఎస్పీ మాత్రం తన పాత ఇంటిని చూపించి అదే తన ఇల్లు అని బుకాయించే ప్రయత్నం చేశారు. ఓ పత్రికకు పరువు నష్టం నోటీసులు స్వయంగా వెళ్లి ఇచ్చారు. ఇదంతా వివాదాస్పదమవుతోంది.

అదే సమయంలో ప్రకాష్ న్యాయస్థానానికి వెళ్తే ఇబ్బందని అనుకున్నారేమో కానీ.. ఎస్పీ ఫక్కీరప్పనే డిఐజిని కలిసి తనపై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని కోరినట్లుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎస్పీ ఫక్కీరప్పతో పాటు,అడిషనల్ ఎస్పీ హనుమంతు,సిసిఎస్ డీఎస్ప మహబూబ్ బాషా,ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పై అనంతపురం టూటౌన్ లో కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్‌ను డిస్మిస్ చేసిన కేసులో ఏ కారణం చెప్పారో ఆ మహిళ .. పోలీసులపైనే తీవ్ర ఆరోపణలు చేసింది. అది ఫేక్ కేసు అని బట్టబయలు అయింది. దీంతో ఎస్పీ తప్పుడు కేసులతో సొంత డిపార్టు మెంట‌్ ఉద్యోగినే డిస్మిస్ చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడీ వివాదం ఎటు తిరుగుతుందో కానీ.. పోలీసు వ్యవస్థకు మాత్రం మచ్చలా మిగిలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి...

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

HOT NEWS

css.php
[X] Close
[X] Close