చినరాజ‌ప్పపై అన‌ర్హ‌త వేయాలంటూ హైకోర్టులో కేసు..!

పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప ఎన్నిక‌ల చెల్ల‌దంటూ అధికార పార్టీ వైకాపా హైకోర్టును ఆశ్ర‌యించింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ స‌రిగాలేద‌నీ, ఆయ‌నకు సంబంధించిన చాలా వివ‌రాల‌ను రాజ‌ప్ప దాచిపెట్టార‌న్న‌ది అభియోగం. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎన్నిక‌ల సంఘాన్ని త‌ప్పుతోవ ప‌ట్టించార‌నీ, ఆయ‌న ఎన్నిక‌ ర‌ద్దు చేయాలంటూ పెద్దాపురం వైకాపా ఇన్ ఛార్జ్ వాణి కోర్టులో పిటీష‌న్ వేశారు. ప్ర‌జాప్ర‌తినిధిగా కొన‌సాగే అర్హ‌త ఆయ‌న‌కి లేద‌ని ఆమె ఆరోపించారు.

రాజ‌ప్ప మీద విజ‌య‌వాడ కోర్టులో ఒక కేసు ఉంద‌నీ, దాని మీద నాన్ బెయిల‌బుల్ వారెంట్ కూడా ఉంద‌ని వాణి అంటున్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసు అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. ఆ కేసులో కూడా రాజ‌ప్ప ముద్దాయిగా ఉన్నార‌నీ, 2007లో జ‌రిగిన ఈ కేసును రాజ‌ప్ప ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో చూపించ‌లేద‌ని వాణి చెప్పారు. ఎన్నిక‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం ఉన్న కేసుల్ని, ఆదాయ మార్గాల వివ‌రాల‌ను త‌ప్పులుగా చూపిస్తే… అన‌ర్హ‌త వేటు పడుతుంద‌ని వాణి అంటున్నారు. గ‌తంలో ఆయ‌న హోం మినిస్ట‌ర్ గా ఉన్నార‌నీ, ఎన్నిక‌లూ నిబంధ‌న‌లు ప‌క్కాగా ఆయ‌నే పాటించ‌క‌పోతే ఎలా అన్నారు. త‌న‌కు వ్య‌వ‌సాయం ద్వారానే ఆదాయం వ‌స్తుంద‌ని అఫిడ‌విట్ లో చెప్పార‌నీ, ఆయ‌న‌కి ఇత‌ర ఆదాయ మార్గాలున్నాయ‌నీ, ఎమ్మెల్సీగా ఉన్నార‌నీ ఆ త‌రువాత పెన్ష‌న్ పొందుతూ ఆ వివ‌రాల‌ను కూడా చూపించ‌లేద‌ని వాణి చెప్పారు. సాంకేతికంగా ఇవ‌న్నీ ఎన్నిక‌ల సంఘాన్ని త‌ప్పుతోవ ప‌ట్టించిన అంశాల కింద‌కే వ‌స్తాయ‌నీ, కాబ‌ట్టి ఆయ‌న శాస‌న స‌భ్య‌త్వంపై అన‌ర్హ‌త వేటు త‌ప్ప‌ద‌ని ఆమె అంటున్నారు.

చిన‌రాజ‌ప్ప మీద ఈ కేసు ఫైల్ చేసిన నేప‌థ్యంలో… రాబోయే ఆరు నెల‌ల్లో పెద్దాపురం ఎమ్మెల్యేగా వాణిని చూస్తామ‌ని వైక‌పా నేత‌లు న‌మ్మ‌కంగా చెబుతున్నారు! సాంకేతికంగా ఆధారాల‌న్నీ త‌మ‌కు బ‌లంగా ఉన్నాయ‌న్న ధీమాతో వాణి ఉన్నారు. మొత్తానికి, ఈ కేసు నేప‌థ్యంలో రాజ‌ప్ప వ్య‌వ‌హారం కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. అఫిడ‌విట్ లో నిజాలు వెల్ల‌డించ‌లేద‌న్న అంశాన్ని కోర్టు ఎలా ప‌రిగ‌ణిస్తుందో చూడాలి. ఈ నేప‌థ్యంలో చినరాజ‌ప్ప స్పంద‌న కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close