నగదు కష్టాలకు ప్రజలే కారణం.. ! చేతులెత్తేసిన కేంద్రం..!!

తెలుగు రాష్ట్రాల్లో .. ఆ మాటకొస్తే.. దేశం మొత్తం మీద ఇప్పుడు నగదు కొరత ఉంది. సగటున దేశం మొత్తం చూస్తే దాదాపుగా 75 శాతం ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్లు మూతబడ్డాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో పది శాతం ఏటీఎంలలో కూడా నగదు నింపడం లేదు. బ్యాంకులకు వెళ్తే… ఐదు వేలో.. పది వేలో చేతుల్లో పెట్టి పంపిచేస్తున్నారు. దీంతో అవసరాలు తీరక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల క్రితం పరిస్థితి తీవ్రమవడంతో.. అరుణ్ జైట్లీ స్పందించారు. దేశంలో తగినంత నగదు ఉందని.. కొన్ని చోట్ల ఇబ్బందులున్నాయని.. రెండు మూడు రోజుల్లో పరిష్కరమవుతుందని చెప్పారు. ఇప్పటికి వారం రోజులు గడిచింది. పరిస్థితిలో ఏ మాత్రం మార్పురాకపోగా.. రోజు రోజుకు దిగజారిపోతోంది.

నగదు కొరత పరిస్థితిని ఎలా అధిగమించాలో కేంద్రానికి అర్థం కావడం లేదు. పెద్ద నోట్ల ఉపసంహరణలోభాగంగా కేంద్రం ఎంత మేర డబ్బులు బ్యాంకులకు వచ్చాయో అంత మేర.. నగదు ముద్రించి బ్యాంకులకు పంపిణి చేశామని చెబుతోంది. కానీ నోట్ల రద్దు నాటి పరిస్థితులే ఇప్పుడు ఉన్నాయి. సమస్యను తాము పరిష్కరించలేమని గుర్తించిన కేంద్రం.. ఆర్బీఐ ద్వారా ప్రజలపైనే నెపాన్ని మోపుతోంది. ప్రజలు డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేసుకుంటున్నారు … కానీ మళ్లీ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా వాదించడం ప్రారంబించింది. ప్రజలతే తప్పనట్లుగా చెప్పుకుంటూ వస్తుంది.

బ్యాంకింగ్ రంగంపై నమ్మకం పోయేలా కేంద్రం వ్యవహరించి.. ఇప్పుడు ప్రజలు తమ డబ్బును తీసి.. తాము ఇంట్లో పెట్టుకుంటూంటే.. గగ్గోలు పెట్టడం ఎవరికైనా ఆగ్రహం తెప్పిస్తుంది. బ్యాంకుల్లో డబ్బులుంటే.. కేంద్రం ఆ పన్నులు.. ఈ పన్నుల పేరుతో లెక్కలు అడుగుతోంది. లేకపోతే.. బ్యాంకులు చార్జీల పేరుతో బాదేస్తున్నాయి. అందుకే ప్రజలు.. తమ సొమ్మును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫిక్సుడ్ డిపాజిట్లను ఉపసంహరించుకుని మరీ.. రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టే సొమ్ములో 70 శాతం బ్లాక్ లోకి వెళ్లిపోతోంది. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం… రిజిస్ట్రేషన వాల్యూ చూపించి.. దానికి టాక్స్ కట్టి.. మిగతా మొత్తాన్ని నగదురూపంలో తీసుకుంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఇక ఆ మొత్తాన్ని బ్యంకులకు చేరకుండా.. దాచేస్తున్నారు. సొమ్ము అలా బ్లాక్ అయిపోతోంది.

అవసరానికి బ్యాంకులు డబ్బులివ్వడం లేదన్న ప్రచారం ఓ వైపు జరుగూతంటే… ఎఫ్ఆర్డీఏ బిల్లు పేరుతో…బ్యాంకులో డిపాజిట్లకు భద్రత లేకుండా చేశారన్న ప్రచారం… ప్రజలు బ్యాంకింగ్ పై నమ్మకం కోల్పోవడానికి మరో కారణం. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే…ఎంతగా ప్రజలను నిందించినా ప్రయోజనం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close