‘ఛ‌ల్ మోహ‌న రంగ’ ట్రైల‌ర్‌: వ‌ండ‌ర్ దేన్ వండ‌ర్ ఫుల్‌

ర‌చ‌యిత‌లు ద‌ర్శ‌కులు అయితే.. బాగుంటుంది. చూడ్డానికేమో గానీ, విన‌డానికి. మంచి డైలాగులు ప‌డ‌తాయి. ‘ఛ‌ల్ మోహ‌న రంగ‌’లోనూ ఆ సౌండింగ్ వినిపించింది. గీత ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌కత్వం వ‌హించిన చిత్ర‌మిది. నితిన్‌, మేఘా ఆకాష్ జంట‌గా న‌టించారు. త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ నిర్మాత‌లు. ట్రైల‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. విజువ‌ల్స్ కూల్‌గా, ఆర్‌.ఆర్ డీసెంట్‌గా, డైలాగులు ‘సెప‌రేట్‌’గా వినిపించాయి. ఓ విధంగా ఇదో వినోదాత్మ‌క ప్రేమ‌క‌థ‌. ల‌వ్‌, ఎమోష‌న్‌, ఫ‌న్‌.. వీటి చుట్టూ తిరిగే క‌థ అని స్ప‌ష్టంగా తెలుస్తోంది. స‌న్నీలియోన్ సిస్ట‌ర్‌లా నితిన్ పోజు.. మందు నిషాలో క‌మెడియ‌న్ స‌త్య‌తో ఆడుకోవ‌డం, చివ‌ర్లో హీరోయిన్ ‘ఉప్పెక్క‌డం’.. ఇవ‌న్నీ… మాస్‌ని, యూత్‌ని బాగా ఆక‌ట్టుకునేలానే క‌నిపిస్తున్నాయి. ”మీతో ప్రాబ్లెం ఇదేనండీ… మీరే ప‌ట్టుకోమంటారు.. మీరే వెళ్లిపోమంటారు” అంటూ మేఘా ఆకాష్‌తో నితిన్ చెప్పే డైలాగ్ యూత్‌కీ మ‌రీ ముఖ్యంగా అబ్బాయిల‌కూ నచ్చేస్తుంది. ‘ఏంటి మీ ప్లాబ్లెం’ అని డాక్ట‌ర్ అడిగితే ‘రాత్రి ప‌ది దాటితే మందు దొర‌క‌డం లేదండీ’ అంటూ కౌంట‌ర్ ఇవ్వ‌డంలో త్రివిక్ర‌మ్ స్టైల్ క‌నిపిస్తోంది. వెట్టి విజువ‌ల్స్‌.. చాలా బాగున్నాయి. త‌మ‌న్ ప్ర‌స్తుతం భీక‌ర‌మైన ఫామ్‌లో ఉన్నాడు. ఆర్‌.ఆర్ ప‌రంగానూ త‌ను ఆక‌ట్టుకున్నాడు. చివ‌ర్లో రావు ర‌మేష్ ఇచ్చిన క్వాయినింగ్ డైలాగ్ ‘వండ‌ర్ దేన్ వండ‌ర్ ఫుల్‌’ ఇంకొంత కాలం వినిపిస్తుంది. మొత్తానికి నితిన్ 25వ సినిమాపై భ‌రోసా పెట్టుకోవొచ్చు అనిపించింది ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.