చంద్రబాబుది అమాయకత్వమా? తప్పులను గుర్తించలేనితత్వమా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో ప్రభుత్వ పరంగా కానీ… పార్టీ పరంగా కానీ.. తప్పులు జరగలేదని… చెప్పుకునేందుకు ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎలాంటి తప్పూ చేయలేదని పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే అదే సమయంలో.. పార్టీ నాయకులు… ఎన్నో తప్పులు జరిగాయి సార్.. అంటూ రోజూ ఆయన తలుపు తడుతున్నారు. దానికి నిన్న జరిగిన కాపు నేతల భేటీనే ఉదాహరణగా మిగిపోయింది.

తప్పులను గుర్తించడానికి చంద్రబాబు రెడీగా లేరా..?

పార్టీ పరంగా.. ప్రభుత్వ పరంగా.. తప్పులేమీ జరగలేదని అనుకుంటూ…లోపాలను కప్పిపుచ్చుకుంటూ పోతే పరిస్థితులు ఎన్నటికీ మెరుగుపడవు. టీడీపీ అధినేతకు.. ఈ విషయం బాగా తెలుసు. అయినప్పటికీ.. చంద్రబాబు.. ఆ తప్పులను.. లోపాలను గుర్తించడానికి ఇష్టపడుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. మొన్న రాజధాని రైతులు తన ఇంటికి వచ్చినప్పుడు కానీ.. నిన్న గుంటూరులో.. టీడీపీ ఆఫీసు వద్దకు వచ్చిన నేతలనుద్దేశించి మాట్లాడినప్పుడు.. కానీ ఏ తప్పూ చేయలేదని… కేవలం జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి చూద్దామన్న ఉద్దేశంతోనే.. ప్రజలు ఓట్లేశారన్న అర్థంలో మాట్లాడారు. ఇది కచ్చితంగా.. నిప్పులపై దుప్పటి కప్పే ప్రయత్నం చేయడమేననేది టీడీపీ నేతల అభిప్రాయం. ఇలా చేయడం వల్ల .. చేసిన తప్పులను గుర్తించండానికి ..వాటిని అధిగమించి.. మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి అవకాశం ఉండదని వారు మథనపడుతున్నారు.

కాపు నేతల ఆవేదన అర్థం కాలేదా..?

ఓటమి తర్వాత ఎన్ని విశ్లేషణలు.. ఎవరైనా చెబుతారు కానీ.. అసలు దెబ్బతిన్న వారు మాత్రమే.. తన అనుభవాలు చెప్పగలుగుతారు. అలా ఓడిపోయిన టీడీపీ నేతలు ఇప్పుడు… తప్పులెక్కడ జరిగాయో .. కథలు.. కథలుగా చెబతున్నారు. చంద్రబాబును కలుస్తున్న నేతలంతా … ప్రభుత్వ పరంగా… పార్టీ పరంగా జరిగిన తప్పులను ఎత్తి చూపి… అవి చిన్నవే కానీ.. తీవ్రమైనవని తేల్చేస్తున్నారు. కాపు సామాజికవర్గం నేతలు.. నిన్న చంద్రబాబును కలిశారు. వారు ఎన్నికల్లో తాము ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. పార్టీ బ్యాక్ ఆఫీస్ పనితీరు గురించి ప్రధానంగా ఫిర్యాదు చేశారు. తమకు పార్టీ నుంచి ఎలా సహకారం అందలేదని… ఒంటరిగా.. ఎదుర్కొని.. ఎలా నెగ్గుకురాగలమని ప్రశ్నించారు. బ్యాక్‌ఆఫీస్‌ అభ్యర్థుల పట్ల.. నిరాదరణ చూపిందని.. ఉదాహరణలతో సహా చెప్పారు.

సొంత అభ్యర్థులపైనే “బ్యాక్ ఆఫీస్” రాజకీయం చేసిందా..?

నిజానికి.. నంద్యాల ఉపఎన్నికల సమయంలో.. పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ల నేతృత్వంలో బ్యాక్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. అది సక్సెస్ అయింది. ఆ ఫార్ములా బాగుందని.. దాన్ని కంటిన్యూ చేశారు. అయితే.. సార్వత్రిక ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి.. టీం మారిపోయింది. నంద్యాల ఎన్నికల సమయంలో… బ్యాక్ ఆఫీస్‌లో పని చేసిన.. ఒక్కరు కూడా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో లేరు. టీమ్ మారిపోయింది. వారిని గైడ్ చేసేవారు లేరు. ప్రత్యక్ష రాజకీయాలకు సంబంధం లేనివారు పెద్ద ఎత్తున అక్కడ చేరడం… ఇష్టమైన నేతలు.. అయిష్టమైన నేతలుగా.. వర్గాలుగా విభజించుకుని… పార్టీ తరపున సాయం…. ఇతర అంశాలతో అంతర్గత రాజకీయ చేయడంతో.. మొత్తానికే తేడా పడిపోయింది. అభ్యర్థులు గెలిస్తేనే.. పార్టీ గెలుస్తుందనే.. చిన్న లాజిక్‌ను బ్యాక్ ఆఫీస్ మర్చిపోయి.. కొంత మంది సొంత అభ్యర్థుల పట్ల నిరాదరణ చూపిందనేది టీడీపీ నేతల ప్రధాన అభియోగం. ఈ తప్పును కూడా గుర్తించడానికి ఇష్టపకపోతే.. ఇక రెక్టిఫై చేసుకోవడానికి ఏముంటుంది..?

తప్పుల్లేవంటే నిప్పులపై దుప్పటేసినట్లే..!?

ప్రభుత్వ పరంగా తప్పులు చేసి ఉండకపోవచ్చు. కానీ.. ఇప్పటి రాజకీయాల్లో తప్పులు చేయకపోవడం కాదు.. చేయలేదని.. చెప్పుకోవడం ముఖ్యం. ప్రత్యర్థి పార్టీలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టడం కీలకం. ఇలాంటి విషయాల్లో టీడీపీ ఘోరమైన నిర్లక్ష్యం చూపించిందని.. సామాన్య కార్యకర్తకూ తెలుసు. అధికారికంగా జన్మభూమి కమిటీల దగ్గర్నుంచి.. చేసిన తప్పులకు లెక్కలేదు. పార్టీ పరంగా.. చేసిన నిర్లక్ష్యంతో.. క్యాడర్‌కు కూడా దూరమైన పరిస్థితి. ఇంతా జరిగి.. తప్పులు చేయలేదని.. వంచన చేసుకుంటే… ఇక ముందు ముందు మెరుగుపడేదెలా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close