ఢిల్లీలో జ‌ర‌గాల్సిన మ‌హా కూట‌మి కీల‌క స‌మావేశం వాయిదా.!

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భాజ‌పా వ్య‌తిరేక ప‌క్షాల‌ను ఏక‌తాటిపైకి న‌డిపించే ప్ర‌య‌త్నాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఆయ‌న కోల్ క‌తా వెళ్లి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెనర్జీతో ఆయ‌న భేటీ అయ్యారు. అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ… త‌మ భేటీలో మోడీ స‌ర్కారు వైఫ‌ల్యాల గురించి ప్ర‌ధానంగా చ‌ర్చించామ‌న్నారు. దీంతోపాటు ఇత‌ర రాజ‌కీయ అంశాల‌పై కూడా మాట్లాడుకున్నాం అన్నారు. మ‌హా కూట‌మి ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో ఈ నెల 22న ఒక స‌మావేశం ఏర్పాటు చేద్దామ‌నుకున్నామ‌నీ, శీతాకాల స‌మావేశాల‌కంటే ముందుగానే ఈ భేటీ ఉంటే మంచిద‌ని మొదట అనుకున్నామ‌నీ, అయితే ఇప్పుడా మీటింగ్ ని వాయిదా వేసుకున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

ప‌లు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప‌రిస్థితి ఉంది కాబ‌ట్టి, మ‌రో తేదీన ఈ స‌మావేశం ఉంటుంద‌న్నారు ఏపీ సీఎం. ఆ తేదీ ఏంట‌నేది త్వ‌ర‌లోనే నిర్ణ‌యించి ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారు. త్వ‌ర‌లో ఏర్పడ‌బోయే కూట‌మి అత్యంత శ‌క్తివంతంగా ఉంటుంద‌నీ, స‌మ‌ర్థ‌మైన పాల‌న అందిస్తుంద‌నే ధీమా వ్య‌క్తం చేశారు. భాజ‌పా పాల‌న‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం అయిపోతున్నాయ‌నీ, దేశంలోని సీనియ‌ర్ నాయ‌కులుగా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌ను కాపాడాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు చంద్ర‌బాబు.

ఆ త‌రువాత‌, మ‌మ‌తా బెనర్జీ మాట్లాడుతూ… భాజ‌పా నుంచి దేశాన్ని కాపాడుకోవాల‌నే అంశంపైనే ప్ర‌ధానంగా చ‌ర్చించామ‌న్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ప్పుడు తాము అండ‌గా ఉన్నామ‌నీ, క‌ర్ణాట‌క విష‌యంలో కూడా మ‌ద్ద‌తు నిలిచామ‌న్నారు. త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేసుకున్న స‌మావేశం వాయిదా వేసుకున్నామ‌నీ, అయితే ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిన వెంట‌నే స‌మావేశం తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని మ‌మ‌తా చెప్పారు. పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యేలోపుగానే స‌మావేశం ఉంటే అవ‌కాశాలున్నాయ‌న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

ప్రారంభమైన రెండో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖులు వీరే

సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా శుక్రవారం 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగుతున్నాయి. 89లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా...మధ్యప్రదేశ్ బైతూల్ లో బీఎస్పీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close