గ‌వ‌ర్న‌ర్ తీరుపై ఢిల్లీలో చంద్ర‌బాబు గ‌ళ‌మెత్తుతారా..?

తిత్లీ తుఫాను కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని కోరారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన బృందంతో సీఎం భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల‌పాటు ఈ స‌మావేశం కొన‌సాగింది. తుఫాను అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించ‌డంతోపాటు, ఏయే పంట‌ల‌కు ఎంతెంత న‌ష్టం వాటిల్లింద‌నేది కూడా వివరించారు. ఆంధ్రాకు కేంద్రం నుంచి త‌క్ష‌ణ సాయం అందేలా నివేదిక ఇవ్వాలంటూ బృందాన్ని కోరారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రానికి వ‌చ్చిన కేంద్రమంత్రి కూడా తుఫాను బాధిత ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే కూడా నిర్వ‌హించ‌లేద‌న్న అసంతృప్తిని చంద్ర‌బాబు వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక‌, శ‌నివారం నాడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు జాతీయ మీడియాతో ఆయ‌న మాట్లాడ‌తార‌ని తెలుస్తోంది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి జ‌రిగిన నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ న‌రిసింహ‌న్ అనుస‌రించిన తీరుపై సీఎం అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. సమాచారం కోసం నేరుగా తనతో మాట్లాడకుండా, పోలీసు ఉన్నతాధికారులతో గవర్నర్ ఎలా మాట్లాడతారని సీఎం అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ఢిల్లీలో కూడా ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా జాతీయ మీడియా ముందు ప్ర‌స్థావించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. గ‌వ‌ర్న‌ర్ పాత్ర‌పై జాతీయ స్థాయిలో చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని భావిస్తున్నార‌ట‌. ఇదే అంశంపై ఇత‌ర జాతీయ పార్టీల నేత‌ల‌ను చంద్ర‌బాబు క‌లుస్తార‌ని స‌మాచారం. నిజానికి, ఇంత‌వ‌ర‌కూ గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ మీదే విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చిన చంద్ర‌బాబు… నిన్న‌టి ఎపిసోడ్ త‌రువాత నేరుగా న‌ర‌సింహ‌న్ తీరుపై కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం గ‌మనార్హం.

వివిధ రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను కేంద్రం ఏవిధంగా వాడుకుంటోంద‌నీ, సొంత రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా రాజ్యాంగబ‌ద్ధ‌మైన వ్య‌వ‌స్థ‌ల్ని భాజపా ఏ విధంగా భ్ర‌ష్టు ప‌ట్టిస్తోంద‌న్న అంశాన్ని ప్ర‌ముఖంగా ఢిల్లీలో చంద్ర‌బాబు ప్ర‌స్థావిస్తార‌ని పార్టీ వ‌ర్గాలూ చెబుతున్నాయి. అందుబాటులో ఉన్న జాతీయ నేత‌ల‌తో చంద్ర‌బాబు భేటీ ఉండొచ్చు అంటున్నారు. అయితే, ఆ వివ‌రాలూ, చంద్ర‌బాబు టూర్ పై మ‌రింత స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. ఇంకోప‌క్క‌… గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌స్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close