‘ఏజెంట్’ పాన్ ఇండియా రిలీజ్‌పై క్లారిటీ

అఖిల్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా ఏజెంట్‌. ఈనెల 28న విడుద‌ల అవుతోంది. ఇంకో 15 రోజుల స‌యం కూడా లేదు. అందుకే ఇప్పుడు ప్ర‌మోష‌న్ల హ‌డావుడి మెల్ల‌గా మొద‌లెట్టింది చిత్ర‌బృందం. ముందు నుంచీ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేస్తామ‌ని చెబుతూ వ‌చ్చారు. స‌డ‌న్‌గా ఇప్పుడు హిందీలో రిలీజ్ చేయ‌డం లేద‌ని తెలిసింది. దీనిపై అఖిల్ క్లారిటీ ఇచ్చారు. ఇది పాన్ ఇండియా సినిమానే అని, కాక‌పోతే.. హిందీలో రిలీజ్ కాస్త ఆల‌స్యంగా విడుద‌ల అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. ”ఇది తెలుగు సినిమా. పాన్ ఇండియా స్థాయిలో వెళ్తోంది. పాన్ ఇండియా అంటే.. అన్ని చోట్లా మంచి రిలీజ్ డేట్ కుద‌రాలి. 28 రూపంలో తెలుగులో మంచి డేట్ దొరికింది. అయితే హిందీలో రిలీజ్ చేయ‌డానికి మాత్రం కొంచెం టైమ్ ప‌డుతుంది. ప‌బ్లిసిటీ చేయ‌డానికి కూడా మా ద‌గ్గ‌ర టైమ్ లేదు. కాంతార లాంటి సినిమాలు హిందీలో ఆల‌స్యంగా విడుద‌లైనా మంచి విజ‌యాన్ని అందుకొన్నాయి. నాకు తెలుగులో ఈ సినిమా బాగా ఆడ‌డం ముఖ్యం. అందుకే తెలుగుపై దృష్టి పెట్టా” అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమా బ‌డ్జెట్ పెరిగిపోయింద‌ని, అఖిల్ మార్కెట్ రేంజ్ ని దాటిపోయింద‌ని నిర్మాత ఈ సినిమాపై భారీ రిస్క్ చేశార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అనిల్ సుంక‌ర స్పందించారు. ”హీరోని బ‌ట్టి మార్కెట్ అనేది లేదు. బాహుబ‌లికి ముందు ప్ర‌భాస్ ఒక‌లా ఉన్నారు. ఆ త‌ర‌వాత ఆయ‌న రేంజ్ మారింది. క‌థ‌పై మాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమా త‌ర‌వాత అఖిల్ స్టార్ అవ్వ‌బోతున్నాడు. అందుకే ఇంత ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగాం” అని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close