సీఎం రేవంత్ రెడ్డే – మంత్రుల జాబితాపైనే పంచాయతీ !

కాంగ్రెస్ సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. అధికారిక ప్రకటన మాత్రం ఇవాళో.. రేపో చేసే అవకాశం ఉంది. 64 మంది ఎమ్మెల్యేలలో 50 మంది రేవంత్ వైపే నిలిచారు. అయితే తాము పార్టీకి కష్ట కాలంలో అండగా ఉన్నామని విజయంలో తమ కృషి కూడా ఉందని భట్టి విక్రమార్క్, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. తమ పేర్లను పరిశీలించాలని కోరారు. అయితే రేవంత్, భట్టిల మధ్యనే పరిశీలకు… అభిప్రాయసేకరణ జరిపారు. రేవంత్ కు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఆ నివేదికను హైకమాండ్ కు పంపారు.

సీఎం ఎంపికతో పాటు మంత్రుల పైనా పరిశీలన జరిపారు. భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎంను ఖరారు చేశారు. సీతక్కను కూడా డిప్యూటీ సీఎంను చేయాలని రేవంత్ రెడ్డి అడిగినట్లుగా తెలుస్తోంది. అలా అయితే డిప్యూటీ సీఎంకు విలువ ఉండదని ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉండాలని భట్టి విక్రమార్క అన్నట్లుగా చెబుతున్నారు. కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలు ఇద్దరికీ మంత్రి పదవులు కష్టం కాబట్టి… .ఏం చేయాలని వారినే పరిశీలకులు అడిగారు. తనకు కాకపోతే తన భార్య పద్మావతికి మహిళా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.

పాత అసెంబ్లీ రద్దయిపోయింది. కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేశారు. ఇక ప్రమాణస్వీకారమే మిగిలింది. రాజ్ భవన్ లో ఏర్పాట్లు కూడా చేశా రు. అయితే హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ప్రమాణస్వీకారం వాయిదా పడింది. .ఐదు, ఆరు తేదీల్లో మంచి రోజులు లేకపోవడంతో ఏడో తేదీనప్రమాణం ఉంటుందని చెబుతున్నారు. కాంగ్రెస్ రాజకీయాలపై స్పష్టత ఉన్న వారికి.. … నాయకత్వంపై స్పష్టత ఇవ్వకుండా… నష్టం చేసుకుంటున్నారని ఇది ఆ పార్టీకి అలవాటేనని సెటైర్లు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close