స్నేహ పూర్వక పోటీ: కూటమికి కాంగ్రెస్ మార్కు వెన్నుపోటు

తెలంగాణలో ఉన్న మొత్తం 119 స్థానాలలో కాంగ్రెస్ 25 స్థానాలను కూటమిలోని మిత్రపక్షాల కు ఇస్తున్నట్టుగా కూటమి ఏర్పాటు చేసిన కొత్తలో ప్రకటించింది . తాము కేవలం 94 స్థానాలలో పోటీ చేస్తామని గతంలో చెప్పింది. అయితే చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ తనదైన శైలిలో మిత్రపక్షాలకు పంచ్ ఇచ్చింది.

కూటమి ఏర్పాటు చేసిన కొత్తలో ప్రకటించిన ఈ 94 స్థానాలతో పాటు మరో ఆరు స్థానాలకు అభ్యర్థులకు బి ఫాం ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ మొత్తంగా వంద సీట్లకు పోటీ చేస్తున్నట్లు అయింది. అది కాకుండా మిత్రపక్షాలకు ఇచ్చిన 19 సీట్లలో లో కూడా దాదాపు 7 సీట్లు ఎంఐఎం పార్టీ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలు. అంటే కాంగ్రెస్ పార్టీ వదులుకున్న స్థానాలు కేవలం 12 అన్నమాట. గతంలో ఇబ్రహీంపట్నం స్థానాన్ని టిడిపికి కేటాయిస్తూ ప్రకటన ఇచ్చింది. టిడిపి అధ్యక్షుడు రమణ, సామ రంగారెడ్డి కి ఇక్కడ నుంచి బి ఫాం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ స్థానాన్ని మల్ రెడ్డి కి కేటాయిస్తూ బి ఫాం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే కోదండరాం టీజేఎస్ పార్టీకి కేటాయించిన ఐదు స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కృష్ణయ్య కు టికెట్ ఇచ్చింది. ఇది గతంలో టీజేఎస్ పార్టీకి కేటాయించిన సీటు. అలాగే వరంగల్ లో కాంగ్రెస్ టీజేఎస్ పోటీకి నిలబడుతున్న గా, మహబూబ్ నగర్ లో టిజెఎస్, టి డి పి పోటీపడుతున్నాయి.

పైకి స్నేహపూర్వక పోటీ అని చెబుతున్నప్పటికీ అన్ని పార్టీల అభ్యర్థుల అంతిమ లక్ష్యం విజయమే కాబట్టి అభ్యర్థులు విజయం సాధించడం కోసం గట్టిగానే ప్రయత్నిస్తారు. మొత్తానికి ఈ మహా కూటమి ఇటువంటి ఫలితాలనిస్తుందనేది ఫలితాల తర్వాతే తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close