చూసేవాళ్ళు చాలా మారారండోయ్…తీసేవాళ్ళకు తప్పదు

సినిమా వాళ్ళందరూ కొన్ని పడికట్టు పదాలను మాత్రం ప్రతి సందర్భంలోనూ వల్లెవేస్తూ ఉంటారు. తమ చేతకానితనానికి ప్రేక్షకులను బాధ్యులను చేస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తున్నారు. మేం తీస్తున్నాం అని చెప్తూ ఉంటారు. నిజానికి కొత్తగా తీయడం చేతకాక చెప్పేసొల్లు కబుర్లే ఇవన్నీ. కాకపోతే 2015 ముందు వరకూ కూడా వీళ్ళ మాటలు కొంచెం కొంచెం నిజమే అనిపించేవి. స్టార్ హీరోల సినిమాలలో విషయం లేకపోయినా ఓ రెండు వారాలపాటు కలెక్షన్స్ వచ్చే పరిస్థితులు ఉండేవి. రొటీన్ కథలే అయినా కూడా ఎంతో కొంత ఆడుతూ ఉండేవి. కానీ 2015 నుంచి మాత్రం ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది. విషయం లేకపోతే హీరో ఎవరు అన్నదానితో సంబంధం లేకుండా తొక్కిపడేస్తున్నారు. కంటెంట్ ఉంటే బిచ్చగాడు, పెళ్ళి చూపులు లాంటి సినిమాలకు కూడా కనకవర్షం కురిపిస్తున్నారు.

ఈ రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆటాడుకుందాం…రా, చుట్టాలబ్బాయి. రెండు సినిమాలకు కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. సాయికుమార్, ఆదిలు కలిసి చుట్టాలబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీ సినిమాగా మార్చేశారు. సాయికుమార్, ఆదిలు రకరకాల డ్రెస్సుల్లో ఒకే ఫ్రేంలో కనిపించడం, సాయి కుమార్ నోట వాడు నా కొడుకు…అని చాలా సార్లు చెప్పించడం, ఇద్దరికీ బోలెడన్ని బిల్డప్ సీన్స్, సినిమాటిక్ హీరోయిజం…అన్నీ కూడా సాయికుమార్ చుట్టాలందరూ కూర్చుని సరదాగా చూసుకోవడానికి సినిమా తీసుకున్నట్టు ఉంటుంది కానీ ప్రేక్షకుల కోసం తీసినట్టు ఉండదు. అందుకే ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో ఫ్రీ పాసులతో వచ్చిన మీడియా వాళ్ళు, సినిమా యూనిట్ మెంబర్స్ కాకుండా టికెట్ కొనుక్కుని వచ్చిన ప్రేక్షకుల సంఖ్య పట్టుమని పది కూడా లేదు.

ఇక ఆటాడుకుందాం…రా సినిమా కథ కూడా సేం టు సేం. ఫ్లాప్స్‌లో ఉన్న హీరో సుశాంత్… అక్కినేని యువ హీరోలను ఇద్దరినీ రంగంలోకి దించేశాడు. బోలెడన్ని సార్లు అక్కినేని వంశం గొప్పదనాన్ని చెప్పుకొచ్చాడు. సినిమాకు హెల్ప్ అవుతాడని అఖిల్‌ని తీసుకొచ్చారో లేక రెండో సినిమా స్టార్ట్ అయ్యేలోపు ప్రేక్షకులు అఖిల్‌ని మర్చిపోతారేమోనన్న భయంతో తీసుకొచ్చారో అర్థం కాలేదు. అఖిల్ తెరపైన కనిపించినంతసేపూ మనవాడిని చూపించడం కోసమే పెట్టిన బిల్డప్ షాట్స్ చూస్తుంటే రెండోదే నిజమనిపిస్తోంది. అక్కినేని ఫ్యామిలీ గురించి చెప్పే ప్రయత్నంలో కథ గురించి అస్సలు పట్టించుకోలేదు. వంశ హీరోల గురించి చెప్తూ….అక్కినేని యువ హీరోలు తెరపైన కనిపిస్తే చాలు…… విజిల్స్ వేస్తూ, కేకలు పెడుతూ ఎగబడి మరీ సినిమా చూసేస్తారన్న మేకర్స్ ఊహలను తల్లకిందులు చేస్తూ థియేటర్ మొహం కూడా చూడలేదు ప్రేక్షకులు.

ఈ రెండు సినిమాలు డిజాస్టర్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవే కాదు ఈ ఇయర్‌లో రిలీజ్ అయినా టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలకు కూడా సేం సినిమా చూపించారు ప్రేక్షకులకు. అందుకే హీరోల బిల్డప్పులు, వంశ చరిత్రలు, హీరోయిజం, సినిమాటిక్ యాక్టింగులు, రొటీన్ కథలు లాంటి రొటీన్ చెత్తను ఇప్పటికైనా డస్ట్‌బిన్‌లో వేసి కొత్తగా ఏమైనా ట్రై చేస్తే బెటర్. సుశాంత్ లాంటి యువహీరోలు నాగార్జున ఇమేజ్‌ని వాడుకుందాం అని ఆలోచించే బదులు మనం, ఊపిరిలాంటి సబ్జెక్ట్స్‌ని సెలక్ట్ చేసుకుంటున్న ఆయన తెలివితేటలను ఫాలో అయితే బెటర్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close