ఆ కేర‌ళ కుట్టిని పెద్ద స్టార్ అయింది స‌రే.. మ‌రి ఆ యువ‌కుడి గురించి తెలుసుకోరా?

ప్రియా ప్రకాశ్ వ‌రియార్‌.. నాలుగు రోజుల కింద‌టి వ‌ర‌కు ఈమె ఎవ‌రో ఎవరికీ తెలియ‌దు. క‌నీసం ఈ పేరు కూడా ఎప్పుడూ విన‌లేదు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి వేరు. ఓవ‌ర్‌నైట్ ఆమె ఓ స్టార్‌గా మారిపోయింది. ఓరు అదార్ ల‌వ్ అనే మ‌ళ‌యాల‌ మూవీతో తెరంగేట్రం చేయ‌బోతున్న ఈ బ్యూటీ.. ఓ సాంగ్‌లో త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో క‌ట్టిప‌డేసింది. ఆ 30 సెకన్ల వీడియోకు కోట్ల మంది ఫిదా అయ్యారు. సినీ నిర్మాత‌లు ఆమె ఇంటి ముందు క్యూ క‌ట్టారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. మ‌రి ఆ అమ్మాయితో పాటు అదే వీడియోలో అదే వ‌య‌సున్న మ‌రో కుర్రాడు క‌నిపిస్తాడు. ప్రియ రేంజ్‌లోనే త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో అద‌ర‌గొట్టాడత‌డు. ఇప్పుడు ఏ ప్రియ స్మైల్‌కైతే దేశ‌మంతా ప‌డిపోయిందో.. అలాంటి ప్రియ‌నే త‌న స్మైల్‌తో ప‌డేశాడు. అయితే అత‌న్ని మాత్రం ఎవ‌రూ పెద్దగా ప‌ట్టించుకోలేదు. ప్రియా ప్రకాశ్‌ గూగుల్ సెర్చ్‌లోనూ స‌న్నీ లియోన్‌ను మించి క్రేజ్ సంపాదించ‌గా.. ఇత‌ని గురించి ఎవ‌రూ తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు.

ఈ 18 ఏళ్ల కుర్రాడి పేరు రోష‌న్ అబ్దుల్లా ర‌వూఫ్‌. ఐసీఏ ఫ‌స్ట్ ఇయ‌ర్ చ‌దువుతున్నాడు. ప్రియాలాగే ఇత‌నికి కూడా ఇదే ఫ‌స్ట్ మూవీ. ఆమెలాగే మ‌ల్టీ టాలెంటెడ్ కూడా. ప్రియా మంచి సింగ‌ర్ కాగా.. ర‌వూఫ్ గ్రేట్ డ్యాన్సర్‌. డ్యాన్స్ రియాల్టీ షో అయిన డీ ఫోర్‌లో ఫైన‌ల్ వ‌ర‌కూ వ‌చ్చాడు. ఇప్పుడు త‌న తొలి సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు. తొలిసారి వెండితెర‌పై త‌న‌ను తాను చూసుకోవ‌డం ఎంతో థ్రిల్లింగా ఉంద‌ని అత‌ను అంటున్నాడు. సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ర‌చూ ఫ‌న్నీ ఫొటోలు పోస్ట్ చేస్తుంటాడు. త‌న తొలి మూవీకి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేసుకున్నాడు. అందులో అత‌ను త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి గాల్లో ఎగురుతుండగా.. ప్రియా వాళ్ల‌ను చూస్తూ ఉంటుంది. ఈ మూవీలో రోష‌న్‌, ప్రియాతోపాటు మ‌రో ఐదుగురు హీరోహీరోయిన్లు ఉన్నారు. మ‌రి కేవ‌లం ఒక్క పాట‌తోనే ఇన్ని సంచ‌ల‌నాలు సృష్టించిన ఈ ఇద్దరూ.. సినిమాలో ఇంకెంత‌లా ఇర‌గ‌దీశారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

జగన్‌కు పీకే నాడు గెలిపించేవాడు – నేడు నథింగ్ !

ప్రశాంత్ కిషోర్ నథింగ్ అని ఐ ప్యాక్ ఆఫీసులో జగన్ పలికిన మాటలకు అక్కడ ఉన్న భారీ ప్యాకేజీలు అందుకుని తూ..తూ మంత్రంగా పని చేసిన రిషిరాజ్ టీం చప్పట్లు కొట్టి ఉండవచ్చు...
video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close