‘దేవ‌ర‌’ మిస్స‌యితే.. దేవ‌ర‌కొండ మిస్ అవ్వ‌డు

ఏప్రిల్ 5… బాక్సాఫీసుకి కీల‌క‌మైన డేట్. ఎందుకంటే… ఈ తేదీకి ముందూ, వెనుక సెల‌వ‌లే సెల‌వ‌లు. వీకెండ్, పండుగ‌లు క‌లిసొస్తున్నాయి. అందుకే ఏప్రిల్ 5 పై నిర్మాత‌లు గురి పెట్టారు. ఈ డేట్ ని ఎన్టీఆర్ `దేవ‌ర‌` ఏనాడో ఫిక్స్ చేసుకొంది. అయితే.. ఇప్పుడు ‘దేవ‌ర‌’ వెన‌క్కి వెళ్తుంద‌న్న వార్త‌లు ఊపందుకొన్నాయి. సైఫ్ అలీఖాన్ గాయం, అనిరుథ్ ఇంకా ట్యూన్లు ఇవ్వ‌క‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో… ‘దేవ‌ర‌’ ఏప్రిల్ 5న రాక‌పోవొచ్చ‌న్న‌ది టీ టౌన్ టాక్.

‘దేవ‌ర‌’ ఎప్పుడైతే డౌట్ లో ప‌డిందో, అప్పుడు దేవ‌ర‌కొండ అలెర్ట్ అయ్యాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ని ఏప్రిల్ 5న విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. నిజానికి ‘దేవ‌ర‌’ విడుద‌లైన వారానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ని తీసుకొద్దామ‌నుకొన్నారు. ఇప్పుడు ‘దేవ‌ర‌’ డౌట్ ప‌డేస‌రికి.. ఆ డేట్ ని దిల్ రాజు క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 9న రావాల‌నుకొన్న టిల్లు స్వ్కేర్ కూడా మంచి డేట్ కోసం ఎదురు చూస్తోంది. సోలో రిలీజ్ సెంటిమెంట్ ఏం లేక‌పోతే… ‘టిల్లు స్వ్కేర్’ కూడా ఎన్టీఆర్ వ‌దులుకొన్న డేట్ కే వ‌చ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో...

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close