మారుతి ప్లాన్ మారిందా?

ప్ర‌తిరోజూ పండ‌గే తో మారుతి ఖాతాలో మ‌రో హిట్టు చేరిన‌ట్టైంది. తొలి రోజు టాక్ కాస్త అటూ ఇటూ ఊగినా, ఫ్యామిలీ ఆడియన్స్ అండ‌తో ఈ సినిమా గ‌ట్టెక్కేసింది. కామెడీ పండించ‌డంలో త‌న‌దైన మార్క్‌ని చూపించ‌గ‌లిగాడు మారుతి. ఈ వారం విడుద‌లైన‌ మిగిలిన సినిమాలు డీలా ప‌డ‌డం కూడా కలిసొచ్చింది. మారుతి త‌దుప‌రి డి.వి.వి దానయ్య త‌న‌యుడితోనే. ఇది వ‌ర‌కే ఈ ప్రాజెక్టు ఖ‌రారైంది. అయితే.. ఇప్పుడు మారుతి త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడ‌ని తెలుస్తోంది. డివీవీ దానయ్య సినిమాని హోల్డ్‌లో ఉంచి ఆ ప్లేసులో ఓ యువ హీరోతో సినిమా చేయాల‌ని ఫిక్స‌యిన‌ట్టు టాక్‌. ఆ సినిమా డివివి దాన‌య్య బ్యాన‌ర్‌లోనే ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మారుతి క‌థ చెబుతానంటే నాని, విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, శ‌ర్వానంద్ లాంటి హీరోలు విన‌డానికి సిద్ధంగా ఉన్నారు. మెగా కాంపౌండ్‌లోనూ మారుతికి మంచి గురి ఉంది. వీళ్ల‌లో ఒక‌రి చేత క‌థ ఓకే చేయించుకోవాల‌ని చూస్తున్నాడు. సెట్స్‌పైకి వెళ్ల‌డానికి కాస్త స‌మ‌యం తీసుకున్నా ఫ‌ర్వాలేదు గానీ, ఈ త‌రుణంలో కొత్త హీరోల‌తో ప్ర‌యోగాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడ‌ట‌. అందుకే దాన‌య్య త‌న‌యుడి సినిమాని హోల్డ్‌లో ఉంచిన‌ట్టు తెలుస్తోంది. హీరో ఎవ‌ర‌న్న‌ది ఫిక్స‌య్యాక‌… మారుతి త‌న కొత్త సినిమాని అధికారికంగా ప్ర‌క‌టిస్తాడు. అయితే హీరో ఓకే అయి కూడా, త‌దుప‌రి ప్రాజెక్టు మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌నుకుంటే, అప్పుడు దాయ‌న్య త‌న‌యుడి సినిమా ఎలాగూ ఉంటుంది. అదీ మారుతి ప్లాను.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close