రాజ‌మౌళి అసిస్టెంట్‌…నాని

కొత్త ద‌ర్శ‌కుల‌తో, స‌రికొత్త క‌థ‌ల‌తో ప్ర‌యాణం సాగిస్తున్నాడు నాని. ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న జెంటిల్‌మేన్‌లో న‌టిస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్త‌య్యింది. త్వ‌ర‌లోనే అష్టాచ‌మ్మా ద‌ర్శ‌కుడు విరించితో క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నాడు. క‌థ కూడా సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి కూడా న‌టిస్తున్నాడ‌ట‌. ఆయ‌న ఓ చిన్న పాత్ర‌లో త‌ళుక్కున మెరుస్తున్నార‌ని టాక్‌.

నాని ఈ సినిమాలో స‌హాయ ద‌ర్శ‌కుడిగా న‌టిస్తున్నాడు. ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా క‌నిపించ‌నున్నాడు. ఆ సీన్ రియ‌లిస్టిక్ గా ఉండాల‌న్న ఉద్దేశంతో రాజ‌మౌళిని సంప్ర‌దించింది చిత్ర‌బృందం. క‌థ న‌చ్చ‌డంతో చిన్న పాత్ర‌లో న‌టించ‌డానికి రాజ‌మౌళి ఒప్పుకొన్నార‌ట‌. పైగా ఈగ సినిమాతో నానికీ, జ‌క్క‌న్న‌కూ మంచి అనుబంధం ఏర్ప‌డింది. దాంతో రాజ‌మౌళి కాద‌న‌లేక‌పోయార‌ట‌. సో.. రాజ‌మౌళిని న‌టుడిగా తెర‌పై చూడొచ్చ‌న్న‌మాట‌. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

ఫోటోలు – టీడీపీ మేనిఫెస్టోలో వైసీపీకి కనిపిస్తున్న లోపాలు !

వైసీపీ మేనిఫెస్టోపై ప్రజల్లో జరుగుతున్న చర్చ జీరో. ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం లేదు. కానీ టీడీపీ మేనిపెస్టోపై టీడీపీ నేతలు ప్రత్యేకమైన ప్రణాళికలతో ప్రచార కార్యక్రమం పెట్టుకున్నారు. అదే...

టార్గెట్ పవన్ కళ్యాణ్ …పొన్నూరులో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం

ఏపీలో టీడీపీ సారధ్యంలోని కూటమిదే అధికారమని సర్వేలన్నీ స్పష్టం చేస్తుండటంతో వైసీపీ నేతల్లో ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబును అడ్డుకుంటే అది వైసీపీకి డ్యామేజ్ చేస్తుందని భావించి పవన్ ను వరుసగా టార్గెట్...

బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ … లక్ష్యం అదే..!?

బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ కూడా వెళ్తున్నట్లు కనిపిస్తోంది.గతంలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గానికి బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇచ్చినట్టుగానే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే చేస్తుండటంతో ఆ పార్టీపై పెదవి విరుపులు మొదలయ్యాయి. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close