క‌లెక్ట‌ర్ల‌కు చంద్ర‌బాబు చెప్పే ప‌నులివేన‌ట‌!

చంద్ర‌బాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్ర‌భుత్వోద్యోగులను రాచిరంపాన పెడ‌తారు అనే విమ‌ర్శ ఎప్ప‌ట్నుంచో వింటున్న‌దే. ఆయ‌న సీఎం అయితే అధికారాల‌ను నిద్ర‌పోనివ్వ‌రు అని అంటుంటారు! గ‌డ‌చిన ఎన్నిక‌ల ముందు ఉద్యోగుల‌కు కూడా చంద్ర‌బాబు ఓ హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వ‌స్తే ఉద్యోగుల‌ను ఎలాంటి ఇబ్బందులూ ఉండ‌వ‌ని! స‌రే, అది గ‌తం. అధికారంలోకి వ‌చ్చాక‌, ఉద్యోగుల విష‌యంలో పాత చంద్ర‌బాబే మ‌ళ్లీ నిద్ర‌లేచారు అంటూ విమ‌ర్శ‌లు ఈ మ‌ధ్య వినిపిస్తున్నాయి. స‌మీక్ష‌లూ స‌మావేశాలంటూ గంట‌ల త‌ర‌బ‌డి కూర్చోబెట్టేస్తారూ, చెప్పిందే చెబుతూ టైం పాస్ చేసేస్తారంటూ ఈ మ‌ధ్య కొన్ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా ఓ క‌థ‌నం ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అదేంటంటే… ప్ర‌మోష‌న్ మీద ఆంధ్రాకి వెళ్ల‌మన్నా కూడా కొంత‌మంది జూనియ‌ర్ అధికారులు వ‌ద్దు వ‌ద్దు అంటున్నార‌ట‌!

జిల్లాకు క‌లెక్ట‌ర్ గా వెళ్ల‌డం అంటే ఐ.ఎ.ఎస్‌. ఆఫీస‌ర్లు ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే, వారు సివిల్స్ రాసిందే ఆ క‌ల‌ను నిజం చేసుకోవ‌డానికి. ఒక జిల్లాకు క‌లెక్ట‌ర్ గా వెళ్తే ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేసే అవ‌కాశం ఉంటుంది. సొంత ఆలోచ‌న‌ల్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టే ఆస్కారం ఉంటుంది. సో.. ఆ అవ‌కాశం కోసం లాబీయింగ్ చేసేవారూ కొంత‌మంది ఉంటారు. కానీ, దానికి భిన్నంగా… కొంత‌మంది జూనియ‌ర్ ఐ.ఎ.ఎస్‌. ఆఫీస‌ర్లు లాబీయింగ్ చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన కొన్ని పోస్టింగుల్లో త‌మ‌కు జిల్లా క‌లెక్ట‌ర్ గా పోస్టింగ్ ఇవ్వొద్దంటూ కొంద‌రు వాపోయార‌ట‌! ఆంధ్రాలో జిల్లా క‌లెక్ట‌రు పోస్టు త‌మ‌కొద్దంటూ చెప్ప‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఏపీ వెళ్లేందుకు ఎందుకు ఇంత అయిష్ట‌త‌తో ఉన్నార‌నే అంశ‌మై ఓ ఉన్న‌తాధికారి ఆరా తీశార‌ట‌. దీంలో వారి మ‌న‌సులోని మాట‌.. రాష్ట్రంలోని వాస్త‌వ ప‌రిస్థితి రెండూ బ‌య‌ట‌పడ్డ‌ట్ట‌యింది.

ఆంధ్రాకు వెళ్తే సొంత ఆలోచ‌ల్ని అమ‌లు చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని కొంత‌మంది జూనియ‌ర్ అధికారులు చెప్పార‌ట‌. ఎంత‌సేపూ ముఖ్య‌మంత్రి జిల్లా ప‌ర్య‌ట‌న‌ల గురించీ, వాటి ఏర్పాటు గురించీ, స‌భ‌ల‌కు స్థలాలు ఎంపిక‌, వీవీఐపీలకు మ‌ర్యాద‌లు, కీల‌క నేత‌ల సౌక‌ర్యాల ఏర్పాట్లు… వీటితోనే స‌మ‌యం స‌రిపోతుంద‌న్నార‌ట‌. సాధార‌ణ పాల‌నా వ్య‌వ‌హారాలు చూసుకునేంత స‌మ‌యం త‌మ‌కు లేకుండా చేసేస్తార‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. ప్ర‌స్తుతం క‌లెక్ట‌ర్లుగా ప‌నిచేస్తున్న‌వారి తీరును గ‌మ‌నిస్తుంటే ఆ విష‌యం అర్థ‌మౌతుంద‌ని, అందుకే క‌లెక్ట‌ర్ గా అవ‌కాశం వ‌చ్చినా కూడా ఆంధ్రాకు వెళ్లేందుకు తాము అయిష్టంగా ఉన్న‌ట్టు వారు వాపోయార‌ట‌.

సో.. వాస్త‌వ ప‌రిస్థితి ఇద‌న్న‌మాట‌. జిల్లాలో పాల‌న వ్యవ‌హారాలు చూసుకునేందుకు కూడా త‌మ‌కు స‌మ‌యం ఉండ‌ద‌ని అధికారులు ముందే భ‌య‌ప‌డిపోతున్నారు! ఇక్క‌డ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. సాధార‌ణ ప‌రిపాల‌న వ్య‌వ‌హారాల‌కు సంబంధించి ఎన్ని ప‌నులు చెప్పినా అధికారులు చేస్తారు. ఎంత స‌మ‌య‌మైనా చేస్తారు. దాన్ని ప‌ని ఒత్తిడిగా భావించ‌రు. అది వాళ్ల విధి. కానీ, అందుకు భిన్నంగా వీరి విధి నిర్వ‌హ‌ణ‌ను ఏపీ సీఎం మార్చేశార‌నే ఆరోపిస్తున్న‌ట్టు అర్థం చేసుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close